బాక్సాఫీస్ ఫైట్ నుంచి డ్రాప్ అవుతున్న మరో స్టార్ హీరో
ప్రస్తుతం అందరిచూపు బడా హీరోల బాక్సాఫీస్ ఫైట్ పైనే ఉంది. ఇటీవల వరుసగా విడుదల చేసిన రిలీజ్ డేట్స్ లలో కొన్ని అనుకోకుండా పోటీకి సిద్ధమయ్యాయి. అయితే కొందరు మాత్రం చర్చలతో ఫైట్ నుంచి డ్రాప్ అవుతున్నారు. ఇక గత కొన్ని రోజులుగా బాలకృష్ణ రవితేజ మధ్య జరగనున్న ఫైట్ పై అనేక రకాల కథనాలు వచ్చాయి. ఖిలాడి, BB3 సినిమాలు మే 28న రానున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇదివరకే ఈ ఇద్దరు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. అనుకోకుండా మూడు సినిమాలు రిలీజ్ డేట్ తో క్లాష్ అయ్యాయి. మొదట బాలకృష్ణ ఒక్క మగాడు, రబితేజ కృష్ణ సినిమాలు క్లాష్ అయ్యాయి. ఇక రెండవసారి 2009లో బాలకృష్ణ మిత్రుడు రిలీజ్ అవ్వగా అదే సమయంలో రవితేజ కిక్ సినిమా విడుదలయ్యింది. మూడవసారి 2011లో జనవరి 12న భారీ స్థాయిలో విడుదలైన పరమవీరచక్ర ప్లాప్ అవ్వగా.. అదే సమయానికి వచ్చిన మిరపకాయ్ మాత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకుంది.

ఇక ఈ సమ్మర్ లో రవితేజ ఖిలాడి సినిమా బాలకృష్ణ బోయపాటి BB3 ఒకేసారి విడుదల అవుతున్నాయని చెప్పగానే ఈ సారి ఎవరు గెలుస్తారో అనే విషయంపై అనేక రకాల కథనాలు పుట్టుకొచ్చాయి. అయితే ఈ పోటీ నుంచి ఇప్పుడు మాస్ రాజా తప్పుకునే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తోంది. ఈ పోటీల్లో అయితే ప్రతిసారి కూడా రవితేజనే పై చేయి సాధిస్తు వచ్చాడు. అయితే ఈ సారి హిట్ కాంబో బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు భారీగానే ఉన్నాయి. అందుకే రవితేజ డ్రాప్ అవుతున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











