Hanuman హనుమాన్ సినిమలో హీరో రవితేజ.. హిట్ సెంటిమెంట్ కంటిన్యూ అవుతుందా?
మాస్ రాజా రవితేజ ప్రస్తుతం ఈగల్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాకు పోటీగా వస్తున్న చిత్రం హనుమాన్. తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమాలో రవితేజ కూడా ఉండబోతున్నారట. చిత్ర యూనిట్ ఓ పోస్టర్ రిలీజ్ చేసి షాకిచ్చింది. అసలు రవితేజ నటించనున్న క్యారెక్టర్ ఏంటి.. అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఈ సంక్రాంతికి ఈగల్ సినిమాతో మాస్ మహారాజా రవితేజ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈగల్ మూవీ జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాకు పోటీగా వస్తున్న సినిమాల్లో ఒకటి హనుమాన్. ఇక ఈ సినిమాలో కూడా రవితేజ ఓ క్యారెక్టర్ కోసం తన గాత్రం ఇవ్వడం విశేషం.

తేజా సజ్జా హీరోగా.. సూపర్ హీరో కథాంశంతో మైథలాజికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా హనుమాన్ మూువీ వస్తుంది. ఇక ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తెలుగు, తమిళ్ ,కన్నడ, మలయాళ, హిందీ భాషలతో పాటు.. పలు భాషల్లో పాన్ వరల్డ్ సినిమాగా హనుమాన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు సినిమాలకు పోటీగా మహేష్ బాబు గుంటూరు కారం, నాగార్జున నా సామిరంగ సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
తన సినిమాకు పోటీగా రిలీజ్ అవుతోన్న హనుమాన్ మూవీకి రవితేజ వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు చిత్ర యూనిట్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.. ఈ సినిమాలో కోటి అనే కోతి పాత్రకు రవితేజ వాయిస్ ఇచ్చాడని తెలుస్తోంది. ఇక ఈ క్యారెక్టర్ ఫన్నీగా ఉంటుందని... హీరోకు అండగా నిలబడే కీలక పాత్రగా ఉంటుందని తెలుస్తోంది. రవితేజ వాయిస్ ఓవర్ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుందని చెబుతున్నారు సినీ విశ్లేషకులు.

కోటి పాత్రకు రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు ఓ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. అయితే ఈ పోస్టర్ లో షాడోలో కోతి కళ్లద్దాలు పెట్టుకుని ఉంది. రవితేజ మైక్ ముందు డబ్బింగ్ చెబుతున్నట్లు కనిపించారు. ఇక రవితేజ సినిమాకు పోటీగా వస్తున్న సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం రవితేజ గొప్పతనమని అంటున్నారు ఫ్యాన్స్. ఇక రవితేజ ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వడం కొత్తేమి కాదని అంటున్నారు.
గతంలో రవితేజ రాజమౌళి తెరకెక్కించిన మర్యాద రామన్న సినిమాలో సైకిల్ కు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇక ఆ క్యారెక్టర్ ఇప్పటికీ గుర్తిండిపోయింది. ఇక ఆ తర్వాత తమిళ హీరో శివ కార్తికేయన్ నటించిన మహావీరుడు సినిమాలో కూడా రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఇక ప్రశాంత్ వర్మ మొదటి సినిమా అ! లో ఓ చేపకు వాయిస్ ఓవర్ ఇచ్చాడు నాని. ఇప్పుడు హనుమాన్ సినిమాలో కోతి క్యారెక్టర్ కు రవితేజ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు. మరి హిట్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూడాలి.


Click it and Unblock the Notifications











