‘బలుపు’ కాంబో రిపీట్.. రవితేజ సరసన హీరోయిన్ కూడ ఆవిడే!
రవితేజ హీరోగా గతేడాది విడుదలైన 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమా ద్వారా చాలా కాలంగా తెలుగు తెరకు దూరమైన ఇలియానా టాలీవుడ్ వైపు అడుగులు వేసింది. ఇదే తరహాలో త్వరలో మరో సీనియర్ హీరోయిన్ రవితేజ సినిమా ద్వారా మళ్లీ తెలుగులో అడుగు పెట్టబోతోంది.
ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం గతంలో తనతో పాటు బలుపు చిత్రంలో నటించిన శృతి హాసన్ రవితేజ తర్వాతి సినిమాకు ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించేది కూడా 'బలుపు' ఫేం గోపీచంద్ మలినేని కావడం గమనార్హం. ఈ చిత్రం సెప్టెంబర్లో మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారట.

రవితేజ ప్రస్తుతం డిస్కోరాజా అనే చిత్రంలో నటిస్తన్న సంగతి తెలిసిందే. విఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్‌ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రూపొందుతున్న ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీగా వేసిన సెట్ లో ప్రస్తుతం హీరో, విలన్ మధ్య పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
'డిస్కోరాజా'లో ఆర్ ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్, నన్ను దోచుకుందువటే ఫేమ్ నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రామ్ తళ్ళూరి ఈ చిత్రాన్ని భారీగా నిర్మింస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి అద్భుతమైన స్పందన వచ్చింది.


Click it and Unblock the Notifications











