‘ఖిలాడీ’ కోసం రవితేజ పర్‌ఫెక్ట్ ప్లాన్: ఆ కాన్ఫిడెన్స్‌తో అనౌన్స్ చేయబోతున్నారట
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం 'ఖిలాడీ' అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. రమేష్ వర్మ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. అయితే, కరోనా రెండో దశ కారణంగా చిత్రీకరణకు బ్రేక్ పడిపోయింది. దీంతో ఈ సినిమాను అనుకున్న సమయానికి (మే 13) ప్రేక్షకుల ముందుకు తీసుకు రాలేకపోయారు. ఇక, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కరోనా ప్రభావం క్రమంగా తగ్గుముఖం పట్టడంతో ఈ సినిమా విడుదల, షూటింగ్ విషయంలో రవితేజ పర్‌ఫెక్ట్ ప్లాన్ వేసినట్లు తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
'ఖిలాడీ' మూవీ బ్యాలెన్స్ షూట్‌ను జూన్ చివరి వారం నుంచి ప్రారంభించతోన్నారట. ఇందులో హీరో రవితేజపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలుస్తోంది. అంతేకాదు, ఈ షెడ్యూల్‌లోనే ఓ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు ఒక సాంగ్‌ను కూడా షూట్ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇది పూర్తైన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని చూస్తున్నారట. మరోవైపు, 'ఖిలాడీ' స్క్రిప్టు మీద ఉన్న కాన్ఫిడెంట్‌తో మిగిలిన సినిమాలతో సంబంధం లేకుండా రిలీజ్ డేట్‌ను కూడా అతి త్వరలోనే ప్రకటించబోతున్నారని కూడా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

ఇదిలా ఉండగా.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న 'ఖిలాడీ'లో రవితేజ డుయల్ రోల్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో పెరిగిపోయాయి. ఇక, ఈ సినిమాను సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మ పెన్మెశ్చ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్, యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలు చేస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నాడు.


Click it and Unblock the Notifications











