‘ఖిలాడీ’ రిలీజ్‌పై చిత్ర యూనిట్ క్లారిటీ: రవితేజ మూవీకి ఓటీటీ ఆఫర్లు నిజమేనంటూ!

మాస్ మహారాజా రవితేజ - రమేష్ వర్మ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం 'ఖిలాడీ'. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ కరోనా ముందు వరకూ శరవేగంగా సాగుతూ వచ్చింది. ఇక, ప్రస్తుతం చిత్రీకరణకు బ్రేక్ పడడంతో ఇప్పటి వరకూ పూర్తయిన భాగానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను జరుపుతోంది చిత్ర యూనిట్. అదే సమయంలో నిర్మాతలు ప్రీ రిలీజ్ బిజినెస్ మీద ఫోకస్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

మాస్ మహారాజా రవితేజకు మాస్ ఆడియెన్స్‌లో భారీ ఫాలోయింగ్ ఉంది. దాన్ని క్యాష్ చేసుకునేందుకు సినిమాను ఓటీటీని అమ్మేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ దీనిపై స్పందించింది. ఈ మేరకు ఓటీటీ రిలీజ్ వార్తలను కొట్టివేసింది. ఎప్పటికైనా ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేస్తామని తేల్చి చెప్పింది. అదే సమయంలో 'ఖిలాడీ' మూవీకి ఓటీటీ సంస్థల నుంచి భారీ స్థాయిలో ఆఫర్లు వస్తున్న మాట నిజమేనని నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి ఈ సినిమా థియేటర్‌లోనే రాబోతుందన్న వార్తతో రవితేజ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Ravi Tejas Khiladi Unit Clarity about OTT Release

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'ఖిలాడీ' మూవీలో రవితేజ డుయల్ రోల్ చేస్తున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో రాబోతున్న ఈ మూవీ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక, ఈ సినిమాను సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మ పెన్మెశ్చ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్, యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలు చేస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X