రవితేజ కెరీర్‌లో మొదటిసారి: ‘క్రాక్’తో రికార్డు క్రియేట్ చేసిన మాస్ మహారాజా

సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నాడు మాస్ మహారాజా రవితేజ. గత ఏడాది 'డిస్కో రాజా' వంటి డిజాస్టర్ మూవీతో వచ్చిన ఆయన.. ఈ సారి పక్కా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే తనకు గతంలో 'డాన్ శ్రీను', 'బలుపు' వంటి హిట్లు ఇచ్చిన యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో జత కట్టి 'క్రాక్' అనే మూవీ చేశాడు. శృతీ హాసన్ హీరోయిన్‌గా చేస్తోన్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు నిర్మించారు. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలైపోయాయి.

సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కాబోతున్న 'క్రాక్'పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవల వచ్చిన ట్రైలర్‌తో ఈ సినిమా రేంజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి చాలా సంస్థలు ముందుకు వచ్చాయి. దీంతో సినిమా బిజినెస్ కూడా భారీగానే జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీన్ని మొత్తంగా 11 వందల థియేటర్లలో ప్రదర్శించబోతున్నారు. ఇప్పటి వరకు రవితేజ కెరీర్‌లో ఇంత భారీగా ఏ సినిమా రిలీజ్ కాలేదు. ఇలా ఆయన అదిరిపోయే రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

Ravi Tejas Krack World Wide Theaters Count

ఇదిలా ఉండగా, ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'క్రాక్'లో రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించాడు. నిజ జీవిత కథలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు దర్శకుడు గోపీచంద్ ఎప్పటి నుంచో చెబుతున్నాడు. ఇక, క్రైమ్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమాలో కోలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ లేడీ విలన్‌గా కనిపించనుంది. ఆమెతో పాటు సముద్రఖని, రవి శంకర్ కూడా నెగెటివ్ రోల్స్ చేస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ ఎస్ థమన్ దీనికి సంగీతం సమకూర్చాడు. ఇప్పటికే విడుదలైన అన్ని పాటలకూ భారీ స్పందన వచ్చిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X