క్రేజీ డైరెక్టర్‌తో రవితేజ 66వ సినిమా.. హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ

వరుస పరాజయాల బాట పట్టిన మాస్ మహారాజ రవితేజ తాజాగా డిస్కో రాజా చిత్రంతో తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు సిద్ధమయ్యాడు. ఓ వైపు వీఐ ఆనంద్ డైరెక్షన్‌లో ఆ సినిమాను రిలీజ్‌కు సిద్దం చేస్తూనే మరో ప్రాజెక్ట్‌పై దృష్టిపెట్టారు. తాజాగా తన కెరీర్‌లో 66వ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రం కోసం డైరెక్టర్ గోపిచంద్‌తో మలినేని జతకట్టడం గమనార్హం.

గతంలో గోపిచంద్ మలినేని, రవితేజది హిట్ కాంబినేషన్. బలుపు, డాన్ శ్రీను సినిమాలు వారిద్దరికి మంచి పేరుతోపాటు కమర్షియల్ సక్సెస్‌ను అందించాయి. ఈ క్రమంలో రవితేజ్ 66వ సినిమా విజయవంతం చేసి హ్యట్రిక్ అందించే పనిలో గోపిచంద్ మలినేని ఉన్నారు.

Raviteja 66th movie with Director Gopi Chand Malineni

రవితేజ కెరీర్‌లో మంచి కమర్షియల్, ఎంటర్‌టైనర్‌గా నిలిచేలా గోపిచంద్ మలినేని ప్రస్తుతం స్క్రిప్టుపై కసరత్తు చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొనేలా, రవితేజ కెరీర్‌ను మరో మెట్టు ఎక్కించే విధంగా ప్రాజెక్ట్‌ను రూపుదిద్దుతున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఓ పవర్‌పుల్ సబ్జెక్ట్‌తో గోపిచంద్ మలినేని వస్తున్నట్టు చిత్ర యూనిట్ పేర్కొన్నది.

రవితేజ కోసం గోపిచంద్ ఓ పోలీస్ ఆఫీసర్ కథను సిద్ధం చేశారని, ఈ సినిమాకు బీ మధు నిర్మాతగా వ్యవహరిస్తారు. నవంబర్‌లో ఈ సినిమా ప్రారంభమై ఆ తర్వాత వెంటనే సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్టు చిత్ర యూనిట్ ఓ ప్రకటనలో వెల్లడించింది.

కాగా, డిస్కో రాజా మూవీ తర్వాత రవితేజ RX 100 ఫేమ్ డైరెక్టర్ అజయ్ భూపతితో సినిమా చేయాల్సింది. అయితే ఆ ప్రాజెక్ట్‌ను వదిలేసి అనూహ్యంగా గోపిచంద్ మలినేనితో జతకట్టడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X