ఫ్యామిలీతో సరదాగా జరుపుకోండి.. సంక్రాంతి కానుకగా క్రాక్ కొత్త పోస్టర్
వరుసగా సినిమాలు ఫెయిల్యూర్ అవుతూ ఉన్న కసిగా మళ్లీ హిట్ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. రాజా ది గ్రేట్ సినిమా తరువాత మరో హిట్ కొట్టలేక సతమతమవుతున్న మాస్ మహారాజ.. ప్రస్తుతం ఓ రెండు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో వస్తోన్న డిస్కో రాజా, గోపిచంద్ మలినేని డైరెక్షన్‌లో వస్తున్న క్రాక్ చిత్రాలు మంచి అంచనాలే ఏర్పడ్డాయి. సంక్రాంతి కానుకగా.. ఈ రెండు చిత్రాల నుంచి ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చాడు.
ఇప్పటికే డిస్కోరాజా పాటలతో, టీజర్స్‌తో భారీ హైప్ క్రియేట్ చేయగా.. తాజాగా రిలీజ్ చేసిన మరో టీజర్ అమాంతం అంచనాలు పెంచేశాయి. టీజర్స్‌తోనే ఈ రేంజ్‌లో హైప్ ఏర్పడ్డ ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదలయ్యేందుకు సిద్దమవుతోంది. అది పూర్తయ్యేలోపే గోపిచంద్ మలినేనితో క్రాక్ సినిమాను పట్టాలెక్కించాడు.

రవితేజ, శ్రుతీ హాసన్, గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన బలుపు చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే మ్యాజిక్‌ను రిపీట్ చేసేందుకు మళ్లీ వీరంతా క్రాక్ అనే చిత్రంతో రాబోతోన్నారు. సంక్రాంతి కానుకగా ఓ కూల్ పోస్టర్‌ను విడుదల చేసింది క్రాక్ యూనిట్. 'మా లాగే మీరు కూడ ఈ పండుగ మీ కుటుంబ సభ్యులతో సరదాగా జరుపుకోండి !! మకర సంక్రాంతి శుభాకాంక్షలు' అంటూ శ్రుతీ హాసన్ బుల్లెట్ నడుపుతున్న పోస్టర్‌ను విడుదల చేశారు.


Click it and Unblock the Notifications











