మాస్ మహారాజా కూతురు టాలీవుడ్ ఎంట్రీ.. ఏ సినిమానో తెలుసా?
టాలీవుడ్ సీనియర్ హీరో మాస్ మహారాజ్ రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా టాలెంట్ తో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎదిగిన హీరోగా క్రెడిట్ పొందిన విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన నటనతో ప్రేక్షకులను అలరించి మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. ఆడియన్స్ నుంచి కూడా మాస్ ఇమేజ్ను సొంతం చేసుకుని మాస్ మహారాజగా బిరుదు పొందారు.
ఇక ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ 57 ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోలకు దీటుగా సినిమాలు చేస్తున్నారు. యాక్షన్ రొమాంటిక్ జోనర్లలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ థియేటర్లో సందడి చేస్తున్నారు. మంచి కథలను అందిస్తూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. 1988 నుంచి ఇప్పటివరకు మాస్ మహారాజా 75 సినిమాలు చేశారు. చివరిగా మిస్టర్ బచ్చన్ సినిమా తో అలరించాడు. ప్రస్తుతం మాస్ జాతర అనే సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

అయితే మాస్ మహారాజా రవితేజ ఇప్పటికే తన కొడుకు మహాధన్ ను తన సూపర్ హిట్ ఫిలిం రాజా ది గ్రేట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేశారు. ఇక మహాధన్ హీరోగా ఎప్పుడు లాంచ్ అవుతారని మాస్ మహారాజ్ అభిమానులు, ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో వారికి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అందింది. మాస్ మహారాజా రవితేజ కూతురు మోక్షద భూపతిరాజు త్వరలో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఆమె నటిగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా లేదు.
22 ఏళ్ళు ఉన్న మోక్షద భూపతిరాజు ఫిలిం ఇండస్ట్రీలో తన జర్నీని ప్రారంభించినట్టు తెలుస్తుంది. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్టైన్మెంట్ స్ బ్యానర్లో ప్రస్తుతం రూపుదిద్దుకుంటున్న ఒక అన్ టైటిల్ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వర్క్ చేస్తున్నారంట. ఇక తెరపైకి కాకుండా తెర వెనక ఉండి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ముఖ్య పాత్ర పోషించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రొడక్షన్ కు సంబంధించిన పనులు అన్నింటిని నేర్చుకునే పనిలో బిజీగా ఉన్నారని తెలుస్తోంది.
ఇప్పటికే మహారాజా తన సొంత బ్యానర్ ఆర్టీ టీమ్ వర్క్స్ లో సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. గట్ట కుస్తీ, రావణాసుర, చాంగురే బంగారు రాజా, సుందరం మాస్టర్.. వంటి సినిమాలను నిర్మించారు. అయితే ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మోక్షద అనుభవం సంపాదిస్తున్నాడంతో మునుముందు ఆ బ్యానర్ లో నిర్మించబోయే సినిమాలను ఆమె దగ్గరుండి చూసుకోబోతున్నారు అని అంటున్నారు. ఇక మాస్ మహారాజా రవితేజ 2002 మే 2న కళ్యాణిని పెళ్లి చేసుకున్నారు. మోక్షద భూపతిరాజ్, మహదన్ కు జన్మనిచ్చారు. ప్రస్తుతం వారి స్కూలింగ్ ను పూర్తి చేసుకొని కెరీయర్ ప్లానింగ్ లో బిజీగా ఉన్నారు. ఓవైపు రవితేజ మాత్రం వరుస చిత్రాలతో అలరిస్తూనే ఉన్నారు. హిట్స్ అందుకుంటూ మరింత జోరు చూపిస్తున్నారు. నెక్ట్స్ మాస్ జాతర సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











