Khiladi Trailer: యాక్షన్ తో పాటు మొదటిసారి లిప్ లాక్ తో షాక్ ఇచ్చిన రవితేజ.. అసలు కథ ఇదే!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వర్గం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాలలో ఖిలాడి కూడా ఉంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాలో డింపుల్ హయాతి మెయిన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. సినిమా విడుదలకు ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులు అన్ని రకాల పనులు పూర్తి చేసుకున్నారు. సెన్సార్ పనులు కూడా ఫినిష్ అయ్యాయి. అయితే ఫైనల్ గా సినిమా ట్రైలర్ తో మరింత పాజిటివ్ బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఇక ట్రైలర్ ఎలా ఉంది అనే విషయంలోకి వెళితే..

అంతకుమించి అనేలా ప్లాన్
మాస్ మహారాజా రవితేజ ఈ సారి మరింత యాక్షన్ తో ఆకట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది క్రాక్ సినిమాతో డిఫరెంట్ గా మాస్ ఆడియన్స్ కు సరికొత్త కిక్కు ఇచ్చిన రవితేజ ఈసారి అంతకుమించి ప్లాన్ చేసినట్లు ఖిలాడి సినిమాతో అర్ధమవుతుంది. ఆ విషయంలో రవితేజ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడనీ కూడా తెలుస్తోంది. సినిమాలో స్టోరీ కూడా చాలా ఆసక్తికరంగా ఉండనుందట.

ఐపీఎల్ ప్లేయర్ ని అంటూ..
"ఎప్పుడు ఓకే టీమ్ కు అడడానికి నేషనల్ ప్లేయర్ ను కాదు. ఐపీఎల్ ప్లేయర్ ని ఎవడు ఎక్కువకు పాడుకుంటే వాడికే అడతాను.." అనే డైలాగ్ తో మొదలైన ఈ ట్రైలర్ లో మాస్ రాజా క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది అనే విషయంలో ఒక క్లారిటీ వచ్చేసింది. మొండిగా దూసుకు వెళ్లే హీరో విలన్స్ కు తగ్గట్టుగా పై ఎత్తులతో ముందుకు సాగే క్యారెక్టర్ తో కనిపించనున్నట్లు అనిపిస్తోంది.

డబ్బు చుట్టూ అసలు కథ
ఈ సినిమా డబ్బు చుట్టూ తిరిగే కథాంశమని దర్శకుడు ట్రైలర్ లో చాలా వివరంగా తెలియ జేశాడు. ఆ డబ్బు కోసం అర్జున్ ఆరా తీయడం.. మరోవైపు మేయిన్ విలన్స్ ఆ డబ్బు కోసమే టార్గెట్ చేస్తుండడం ఆసక్తిగా అనిపిస్తోంది. ఇక మరో షేడ్ లో హీరో మోహన్ గాంధీ అనే పాత్రలో నటిస్తుండగా.. అనసూయ కూడా డిఫరెంట్ కామెడీ పాత్రలో నటించినట్లు అనిపిస్తోంది.

రవితేజ లిప్ లాక్
ఇక డింపుల్ హాయతి తో రొమాన్స్ కూడా హైలెట్ అయ్యేలా ఉందని అనిపిస్తోంది. మోదటిసారి రవితేజ ఏకంగా లిప్ లాక్ సన్నివేశంలో కూడా దర్శనమివ్వడం విశేషం. అది కూడా చాలా ఘాటైన లిప్ లాక్ అనిపోస్తోంది. ఇక డబ్బు కోసం హీరో విలన్ ల తో ఏ విధంగా పోరాడాడు అనే అంశాలు కూడా చాలా బలంగా కనిపిస్తున్నాయి.
Recommended Video
దేవిశ్రీప్రసాద్ అదరగొట్టేశాడు
ముఖ్యంగా సరికొత్త యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాను రూపొందించారని అర్థమవుతోంది. మాస్ మహారాజా రవితేజ కూడా ఈ సినిమాలో సరికొత్త బాడీలాంగ్వేజ్ తో ఆకట్టుకోబోతున్నాడు. ఇక దానికి తోడు దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం కూడా హైలెట్ గా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కు మరింత అందాన్ని ఇచ్చింది. మొత్తానికి సినిమా ట్రైలర్ అయితే బాగానే ఉంది. మరి ఫిబ్రవరి 11న రాబోయే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











