ఖిలాడీ అప్డేట్.. టీజర్ ఎప్పుడంటే?

మాస్ మాహారాజ రవితేజ ఇప్పుడు ఖిలాడీ సినిమాతో మంచి ఊపుమీదున్నాడు. క్రాక్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో రెట్టింపు ఉత్సాహంతో ఖిలాడీ షూటింగ్‌ను కానిచ్చేస్తున్నాడు. అయితే రవితేజ స్పీడుకు కరోనా బ్రేకులు వేసింది. ఇటలీలో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ చేస్తోన్న రవితేజకు అక్కడి ప్రభుత్వం షాకిచ్చినట్టు తెలుస్తోంది. కరోనా కారణంగా షూటింగ్‌లకు అనుమతి నిరాకరించినట్టు తెలుస్తోంది.

అయితే మళ్లీ సినిమాపై అనుమానాలు మొదలయ్యాయి. అనుకున్న సమయానికి మూవీ వస్తుందా? రాదా? అని అందరూ అనుకున్నారు. కానీ ఖిలాడీ టీం మంచి కాన్ఫిడెంట్‌తో ఉన్నట్టు కనిపిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి ఓ అప్డేట్ వచ్చింది. రవితేజ విశ్వరూపాన్ని చూపించేందుకు ఖిలాడీ టీజర్‌ను రెడీ చేశారు. ఈ క్రమంలో ఖిలాడీ టీజర్ ఎప్పుడో రాబోతోందో చెబుతూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు.

raviteja Khiladi Teaser on 12th April

ఇప్పటికే వదలిన ఖిలాడీ మోషన్ పోస్టర్, ఫస్ట్ గ్లింప్స్, పోస్టర్లు అన్నీ కూడా వైరల్ అయ్యాయి. ఇక ఈ టీజర్‌తో అంచనాలు పెంచేలా ఉన్నారు. ఏప్రిల్ 12న ఉదయం పది గంటల ఎనిమిది నిమిషాలకు టీజర్ రాబోతోందంటూ ప్రకటించారు. ఈ సినిమాను మే 28న రిలీజ్ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. వీర సినిమా తరువాత రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ నటిస్తోన్న చిత్రమిది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X