‘క్రాక్’ అప్‌డేట్.. లోడింగ్ రాకింగ్ ఎపిసోడ్.. డైరెక్టర్ ట్వీట్
మాస్ మహారాజా రవితేజకు కాలం కలిసి రావడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. ఒక్క హిట్ కొట్టి గట్టెక్కలేకపోతున్నాడు. వరుసగా డిజాస్టర్‌లు పలకరిస్తున్నా.. పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అమర్ అక్బర్ ఆంటోని, నేల టిక్కెట్టు ఇలా వరుసగా ఫ్లాపులు రాగా.. రీసెంట్‌గా వచ్చిన డిస్కోరాజా సైతం ఏమంతగా ఆకట్టుకోలేకపోయింది.
ఇక లాభం లేదనుకున్న రవితేజ.. మళ్లీ తన మిత్రుడికి అవకాశమిచ్చాడు. డాన్ శీను, బలుపు వంటి చిత్రాలను తీసి హిట్ కొట్టిన గోపిచంద్ మలినేనితో క్రాక్ సినిమాను చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్‌డేట్ వచ్చేసింది.

క్రాక్ మూవీ ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీలోని రాకింగ్ ఎపిసోడ్ లోడ్ అవుతోందని ట్వీట్ చేశాడు. ఫైట్ మాష్టర్ రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో అదిరిపోయే ఓ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కబోతోన్నట్లు ఫోటోను చూస్తే తెలుస్తోంది. ఈ సినిమాలో రవితేజ సరసన శ్రుతీ హాసన్ నటిస్తోంది. ఈ మూవీ మే 8న విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











