Eagle Pre Release Event: స్టేజీపైనే మ్యూజిక్ డైరెక్టర్‌కు రవితేజ మాస్ వార్నింగ్.. ఏం జరిగిందంటే?

మాస్ మహారాజా రవితేజ హీరోగా రాబోతున్న సరికొత్త సినిమా ఈగల్. టైగర్ నాగేశ్వర రావు సినిమా తర్వాత రవితేజ హీరోగా రాబోతున్న ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేనని దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 9వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం రోజు గ్రాండ్ గా జరిగింది. అయితే ఈవెంట్ లో భాగంగా రవితేజ మాట్లాడుతూ.. మ్యూజిక్ డైరెక్టర్ దేవ్ జాంద్ కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా రాబోతున్న ఈగల్ సినిమాలో రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ లు హీరోయిన్లుగా నటించారు. నవదీప్, వినయ్ రాయ్ లు ప్రధాన పాత్రల్లో కనిపించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమాకు కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని దర్శకత్వం వహించాడు. మరో ఐదు రోజుల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈక్రమంలోనే హీరో రవితేజ స్టేజీపై మాట్లాడారు. అందరినీ మెచ్చుకున్న ఆయన.. మ్యూజిక్ డైరెక్టర్ కు మాత్రం వార్నింగ్ ఇచ్చారు.

Raviteja Mass Warning to Music Director Davzand in Eagle Pre Release Event Stage Check Details

ఈగల్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గా దవ్‌జాంద్ వ్యవహరించారు. అయితే స్టేజీపై ఉన్న దవ్‌జాంద్ గురించి మాస్ మహారాజా మాట్లాడుతూ.. నీ సౌండ్ కచ్చితంగా అదిరిపోతుందని చెప్పారు. నేను అక్కడక్కడా విన్నాను కానీ మిక్సింగ్ అయ్యాకా పూర్తిగా వినలేదని స్టేజీ మీదే చెప్పేశారు. ఆ తర్వాత అవన్నీ విన్న తర్వాత అంటే రేపు నీ పని చెప్తాను అంటూ అన్నారు. ఆ పాటలు విన్న తర్వాత మ్యూజిక్ ఎలా వచ్చిందనే దాని గురించి ఆయతో మాట్లాడతానని.. తనదైన స్టైల్ లో చెప్పారు.

అలాగే డైరెక్టర్ గురించి హీరోయిన్ల గురించి కూడా వివరించారు. సినిమా మొత్తం అనుపమ పరమేశ్వరన్ పాత్ర చుట్టు తిరుగుతుందని.. కార్తీక్ ఘట్టమనేని టాలెంట్ ను ఈ సినిమాలో చూడవచ్చని రవితేజ అన్నారు. అలాగే తాన పూర్తిగా రేపు సినిమా చూస్తానని.. దానికోసం చాలా రోజులుగా తాను కూడా వేచి చూస్తున్నట్లు వివరించారు. సినిమాలో ఏవేవో కొత్త ఎఫెక్ట్ లు వాడినట్లు చెప్పారని.. అవేంటో తనకు కూడా తెలియవని అన్నారు. అయితే తన అభిమానులు, ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో, తాను కూడా అంతే ఎదురు చూస్తున్నానని మరోసారి చెప్పుకొచ్చాడు.

Raviteja Mass Warning to Music Director Davzand in Eagle Pre Release Event Stage Check Details

సినిమా షూటింగ్ మాత్రం చాలా బాగా జరిగిందని.. సినిమా కూడా బాగా వచ్చిందని హీరో రవితేజ వెల్లడించారు. అలాగే ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ ధృవన్ చేసిన క్యారెక్టర్ కచ్చితంగా పిల్లలు అందరికీ కనెక్ట్ అవుతుందని స్పష్టం చేశారు. మరి మాస్ మహారాజా రవితేజ హీరోగా చేసిన ఈ సినిమా ఈ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X