twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌కే మరో ఛాన్స్.. అందుకే రవితేజ గ్రేట్!

    |

    మాస్ మహారాజా రవితేజ డైరెక్టర్ల హీరో. ఓ డైరెక్టర్ ఫ్లాప్ ఇచ్చాడని దూరం పెట్టడు. ఎప్పటికైనా హిట్ కొడతాడనే నమ్మకం పెట్టుకుంటాడు. అందుకే డిజాస్టర్ సినిమాలు ఇచ్చినా సరే మళ్లీ నమ్ముతాడు. వారికి చాన్సులు ఇస్తాడు. అలా రవితేజ ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్‌లు కొట్టాడు. రవితేజ అలాంటి వాడు కాబట్టే షాక్ వంటి డిజాస్టర్ తరువాత కూడా హరీష్ శంకర్‌కు చాన్స్ ఇచ్చాడు మిరపకాయ్ అంటూ దుమ్ములేపాడు.

    వీర లాంటి ఘెరమైన ఫ్లాప్ ఇచ్చినా సరే రమేష్ వర్మను మళ్లీ నమ్మాడు. తాజాగా ఓ అవకాశాన్ని ఇచ్చాడు. రమేష్ వర్మ ఈ మధ్య రాక్షసుడు రీమేక్‌తో సూపర్ హిట్ అందుకున్నాడు. రీమేక్ చిత్రమే అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు మెచ్చేలా తీయడంతో రమేష్ వర్మ సక్సెస్ అయ్యాడు. రాక్షసుడుతో మళ్లీ ఫాంలోకి వచ్చాడు. ఇక ఏకంగా రవితేజకే కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు.

    Raviteja New Movie With Ramesh Varma

    రమేష్ వర్మ-రవితేజ కాంబోలో రాబోతోన్న ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు రేపు (అక్టోబర్ 18) నిర్వహించబోతోన్నారు. రేపే ఉదయం 11:55 గంటలకు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేస్తారట. రవితేజ కెరీర్‌లో 67వ చిత్రంగా రాబోతోండగా టైటిల్ ఆసక్తికరంగా ఉంటుందని టాక్. ఖిలాడీ అంటూ రాబోతోన్న ఈ చిత్రంలో రవితేజ డబుల్ యాక్షన్ అని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

    English summary
    Raviteja New Movie With Ramesh Varma, Yet another interesting & entertaining one lined up
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X