Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్‌స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్‌మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌కే మరో ఛాన్స్.. అందుకే రవితేజ గ్రేట్!
మాస్ మహారాజా రవితేజ డైరెక్టర్ల హీరో. ఓ డైరెక్టర్ ఫ్లాప్ ఇచ్చాడని దూరం పెట్టడు. ఎప్పటికైనా హిట్ కొడతాడనే నమ్మకం పెట్టుకుంటాడు. అందుకే డిజాస్టర్ సినిమాలు ఇచ్చినా సరే మళ్లీ నమ్ముతాడు. వారికి చాన్సులు ఇస్తాడు. అలా రవితేజ ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టాడు. రవితేజ అలాంటి వాడు కాబట్టే షాక్ వంటి డిజాస్టర్ తరువాత కూడా హరీష్ శంకర్‌కు చాన్స్ ఇచ్చాడు మిరపకాయ్ అంటూ దుమ్ములేపాడు.
వీర లాంటి ఘెరమైన ఫ్లాప్ ఇచ్చినా సరే రమేష్ వర్మను మళ్లీ నమ్మాడు. తాజాగా ఓ అవకాశాన్ని ఇచ్చాడు. రమేష్ వర్మ ఈ మధ్య రాక్షసుడు రీమేక్‌తో సూపర్ హిట్ అందుకున్నాడు. రీమేక్ చిత్రమే అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు మెచ్చేలా తీయడంతో రమేష్ వర్మ సక్సెస్ అయ్యాడు. రాక్షసుడుతో మళ్లీ ఫాంలోకి వచ్చాడు. ఇక ఏకంగా రవితేజకే కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు.
రమేష్ వర్మ-రవితేజ కాంబోలో రాబోతోన్న ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు రేపు (అక్టోబర్ 18) నిర్వహించబోతోన్నారు. రేపే ఉదయం 11:55 గంటలకు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేస్తారట. రవితేజ కెరీర్లో 67వ చిత్రంగా రాబోతోండగా టైటిల్ ఆసక్తికరంగా ఉంటుందని టాక్. ఖిలాడీ అంటూ రాబోతోన్న ఈ చిత్రంలో రవితేజ డబుల్ యాక్షన్ అని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.