కరోనా క్రైసిస్ ఛారిటీ.. సినీ కార్మికులకు అండగా.. చిరు పిలుపుతో కదిలిన తారలు
కరోనా వైరస్ విజృంభించడం.. 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించడంతో సినీ కార్మికుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. షూటింగ్స్ లేక రోజూవారి కార్మికులు పడే ఇబ్బందులు తెలుసుకున్న సినీ పెద్దలు వారిని ఆదుకునేందుక ముందుకు వస్తున్నారు. ఈ మేరకు చిరంజీవి పెట్టిన కరోనా క్రైసిస్ ఛారిటీకి నిధులు పోటెత్తుతున్నాయి. చిరు ఇచ్చిన పిలుపుకు స్పందించిన సెలెబ్రిటీలు తోచిన మేర సాయాన్ని ప్రకటిస్తున్నారు.

కోటీ రూపాయల చిరు విరాళం..
కరోనా కష్ట కాలంలో సినీ కార్మికులను ఆదుకునేందుకు చిరంజీవి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించాడు. అంతేకాకుండా మిగతా వారు కూడా స్పందించాలని కోరాడు. దీంతో మహేష్ బాబు 25 లక్షలు, రామ్ చరణ్ 30 లక్షలు, ఎన్టీఆర్ 25లక్షలు, దగ్గుబాటి ఫ్యామిలీ కోటి, నాగార్జున కోటి రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఇలా మొత్తంగా 3.8కోట్లు వచ్చాయని చిరంజీవి పేర్కొన్నాడు.

వెల్లువెత్తిన విరాళాలు..
ఇక చిరు పిలుపుతో విరాళాలు వెల్లువెత్తాయి. సినీ కార్మికులను ఆదుకునేందుకు యువ హీరోలు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో వరుణ్ తేజ్(20 లక్షలు),నాగ చైతన్య(25 లక్షలు), శర్వానంద్(15 లక్షలు), విశ్వక్‌సేన్ (5 లక్షలు)వంటి వారు కదిలి వచ్చారు. తమకు తోచిన ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.

ముందుకు వచ్చిన రవితేజ..
సినీ కార్మికులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన రవితే.. ‘ఎదుటివారికి ఇచ్చినప్పుడే తీసుకునే దాంట్లో ఉండే ఉద్దేశ్యం అర్థమవుతుంది.. సినీ కార్మికుల బాధను మాటల్లో చెప్పుకునేది కాదు.. కరోనా క్రైసిస్ ఛారిటీలో నా తరుపున 20 లక్షలు కలుపుతున్నా'ని ట్వీట్ చేశాడు.
Recommended Video

కదిలిన దిల్ రాజు..
టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ బ్యానర్, తిరుగులేని నిర్మాత అయిన దిల్ రాజు కరోనా కష్టకాలంలో సినీ కార్మికులను ఆదుకునేందుకు ముందుకు వచ్చాడు. పది లక్షల రూపాయలను కరోనా క్రైసిస్ ఛారిటీకి ఇచ్చి నిజంగానే దిల్ ఉందని నిరూపించుకున్నాడు.


Click it and Unblock the Notifications











