Rashmika in Pushpa: రా లుక్ తో రచ్చ చేయనున్న రష్మిక.. గెట్ రెడీ!
గతే ఏడాది అల వైకుంఠపురంలో సినిమాతో ప్రజలు ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు అల్లు అర్జున్. త్రివిక్రమ్ దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో పోటీ పడి మరీ సంక్రాంతి రేసులో ఆ సినిమా కి గట్టి పోటీ ఇచ్చింది. అల వైకుంఠపురంలో సినిమా పూర్తయిన తర్వాత ఆయన సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్నారు. గతంలో వీరి కాంబోలో ఆర్య, ఆర్య 2 లాంటి సూపర్ హిట్ సినిమాలు అందించడంతో ఈ సినిమా ప్రారంభమైన నాటి నుంచి సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. దీనికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. ఈ సినిమాలో మొట్టమొదటిసారిగా అల్లు అర్జున్ ఒక డీ గ్లామర్ లుక్ లో కనిపిస్తున్నారు.
ఇప్పటివరకు నటించినటువంటి రీతిలో ఈ సినిమాలో నటించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది . ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే ఒక లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తిగా చిత్తూరు జిల్లా నేపథ్యంలో అక్కడి శేషాచలం అడవుల్లో జరుగుతోంది. ఈ సినిమాలో ఆయన ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే ఒక లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు. లారీ డ్రైవర్ రేంజ్ నుంచి ఆయన ఒక మాఫియా డాన్ రేంజ్ కి ఎలా ఎదిగాడు అనే నేపథ్యంలో కూడా సినిమా ఉండబోతోందని ప్రచారం జరుగుతోంది కానీ దాని మీద సరయిన క్లారిటీ అయితే లేదు. ఇప్పటికే ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

అలాగే ఈ సినిమా మొత్తం మీద ఐదు భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతోంది. అందుకు తగ్గట్టుగానే ఐదు భాషల్లో సినిమా యూనిట్ ప్రచారం చేస్తూ వస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ ఇవ్వనున్నట్టు యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు. రేపు ఉదయం అంటే సెప్టెంబర్ 29వ తేదీన ఉదయం 09:45 నిముషాలకు ఆమె లుక్ విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ఇక ఫహద్ ఫాజిల్, సునీల్, యాంకర్ అనసూయ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక క్రిస్మస్ కి విడుదల చేస్తామని యూనిట్ అధికారికంగా ప్రకటించింది కానీ తేదీ అయితే ఇంకా ప్రకటించలేదు. అయితే ముందు 24వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారని కానీ ఇప్పుడు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే 83 సినిమా అప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉండడంతో హిందీ మార్కెట్ విషయంలో ఇబ్బంది పడే అవకాశం ఉందని అందుకే ఒక వారం ముందే రావచ్చని అంటున్నారు. మరి చూడాలి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది.


Click it and Unblock the Notifications











