సగిలేటి కథ రాయలసీమ బలగం కాబోతున్నాదా? ట్రైలర్ చూసి ఫిదా.. ఆర్జీవి, హీరో నవదీప్ కనెక్షన్ ఏంటంటే?
కంటెంట్ ఉన్న తెలుగు నేటివిటీ కథలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వ్యక్తమవుతున్నది. బలగం, ఇంటింటి రామాయణం, ఫిదా లాంటి చిత్రాలు తెలంగాణ భాష, యాసతో భారీ విజయాలు అందుకొన్నాయి. అయితే అదే దారిలో ప్రస్తుతం రాయలసీమ యాస, భాషతో ఓ ఫీల్‌గుడ్ చిత్రంగా సగిలేటి కథ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ చిత్రం రవి మహదాస్యం, విషికా లక్ష్మణ్, నరసింహ ప్రసాద్ తదితరులు నటించారు. ఈ సినిమా ట్రైలర్ చూసిన హీరో నవదీప్ సమర్పకుడిగా మారారు. దాంతో ఈ సినిమాకు మరింత బజ్ క్రియేట్ అయింది. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ సినిమా వివరాల్లోకి వెళితే..
సగిలేటి కథ చిత్రాన్ని అశోక్ ఆర్ట్స్, షేడ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై రవితేజ మహాదాస్యం, విషికా కోట నిర్మించారు. పూర్తిగా రాయలసీమ బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన ఈ చిత్రానికి రాజశేఖర్ సుద్‌మూన్ దర్శకత్వం మాత్రమే కాకుండా ఎడిటర్, రచయితగా, సినిమాటోగ్రాఫర్‌గా బాధ్యతలు నిర్వహించారు.

సగిలేటి కథ సినిమా ట్రైలర్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో వినూత్నంగా నిర్వహించారు. చికెన్ ఓ ఎమోషన్ అంటూ చిన్న స్కిట్‌ను హీరో, హీరోయిన్లు ప్రదర్శించారు. ఈ స్కిట్‌లో కోడి పాత్ర కీలకంగా మారింది. కోడి తన బాధలను చెప్పుకొంటుంటే.. అందరూ నవ్వుల్లో మునిగిపోయారు.
సగిలేటి కథ సినిమా ట్రైలర్ రిలీజ్‌కు ముందు చిత్ర యూనిట్‌కు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ బెస్టాఫ్ లక్ చెప్పారు. దర్శకుడు రాజశేఖర్ చెప్పిన కథ, అతడి ప్రతిభ చూసి నాకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. సగిలేటి కథ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాలని ఆర్జీవి ఆకాంక్షించారు.

సగిలేటి కథ సినిమా ట్రైలర్ ఆద్యంతం తెలుగు నేటివిటితో సాగింది. గంగాలమ్మ జాతర నేపథ్యంగా కథను దర్శకుడు రాజశేఖర్ వినూత్నంగా చెప్పే ప్రయత్నం చేశారని అనిపించింది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత రాయలసీమ కథతో మరో బలగం రాబోతున్నదా? అనే అభిప్రాయం వ్యక్తమైంది.
నిర్మాత దేవీ శ్రీ ప్రసాద్ బలివాడ మాట్లాడుతూ.. థియేటర్లలో బాగా ఎంజాయ్ చేయదగిన సినిమా ఇది. మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న చిత్రం. హీరో నవదీప్ సమర్పించడానికి ముందుకు రావడం చాలా హ్యాపీగా ఉంది. ట్రైలర్ చూసి సోహైల్ ఈ వేడుకకు వచ్చినందుకు ధన్యవాదాలు అని అన్నారు.
నేను రాయలసీమ ప్రాంతానికి చెందిన వాడిని. అక్కడి సంప్రదాయాలు, సంస్కృతి గురించి నాకు బాగా తెలుసు. కథ పూర్తిగా కొత్తగా ఉంటుంది. కథలో రాయలసీమ మట్టి వాసనలు గుభాలిస్తాయి. ఈ సినిమా తీయడానికి రాంగోపాల్ వర్మ ఇచ్చిన ధైర్యం, ప్రోత్సాహం ఎంతో ఉంది అని దర్శకుడు రాజశేఖర్ అన్నారు.


Click it and Unblock the Notifications











