Upcoming Movies: ఈనెలలో విడుదలయ్యే తెలుగు చిత్రాలివే.. మొత్తం 10, చూడాల్సినవి మాత్రం!
కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టినప్పటి నుంచి అనేక అద్భుతమైన సినిమాలు వస్తూ.. సినీ ప్రియులను తెగ అలరిస్తున్నాయి. స్టార్ హీరోల చిత్రాలే కాకుండా చిన్న హీరోల సినిమాలు కూడా థియేటర్ల వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా సరికొత్త కథాంశలతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతున్నారు. మహాశిరవార్తి సందర్భంగా నాలుగు స్పెషల్ సినిమాలు విడుదల అయి థియేటర్ల వద్ రచ్చ చేస్తున్నాయి. ఇవి మాత్రమే కాకుండా మరికొన్ని కొత్త సినిమాలు కూడా ఇదే నెలలో వచ్చి హిట్ కొట్టాలని చూస్తున్నాయి. అయితే ఈ నెలలో ఏయే సినిమాలు ఎప్పుడెప్పుడు విడుదల కాబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మార్చి నెల మూడో వారంలో భాగంగా చాలానే సినిమాలు సందడి చేయబోతున్నారు. ముఖ్యంగా యాంకర్ అనసూయ ప్రధాన పాత్రలో రాబోతున్న రజాకార్ సినిమా ఈ వారమే విడుదల కాబోతుంది. యాట సత్యనారాయణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను మార్చి 15వ తేదీన రోజు థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. అలాగే కుమార స్వామి డైరెక్షన్ లో చైతన్యరావు ప్రధాన పాత్రలో వస్తున్న షరతులు వర్తిస్తాయ్ సినిమా కూడా మార్చి 15వ తేదీనే విడుదల కాబోతుంది.

యష శివకుమార్, హెబ్బా పటేల్, సునీల్, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలో నవీన్ రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న వెయ్ దరువెయ్ సినిమా కూడా మార్చి 15వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. యాక్షన్, కామెడీ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమాపై భారీగానే అంచనాలు నమోదు అయ్యాయి. మలయాళ భాషల్లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన మంజుమ్మల్ బాయ్స్ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయబోతున్నారు. మార్చి 15వ తేదీనే ఈ సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

కుంగ్ ఫూ పాండా 3కి సీక్వెల్ రాబోతున్న కుంగ్ ఫూ పాండా 4 సినిమా కూడా మార్చి 15వ తేదీన విడుదల కాబోతుంది. కామెడీ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమా కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో వస్తున్న ఆ ఒక్కటి అడక్కు సినిమా కూడా ఇదే నెలలో రిలీజ్ కాబోతుంది. ఫరియా అబ్దుల్లా, వెన్నెల కిషోర్, వైవా హర్ష, అరియానా గ్లోరీలు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం మార్చి 22వ తేదీన విడుదల కాబోతుంది.

శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో ప్రియదర్శి, శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్ లు ప్రధాన పాత్రల్లో రాబోతున్న ఓం భీం బుష్ సినిమాను మార్చి 22వ తేదీన విడుదల చేయబోతున్నారు. విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరోహీరోయిన్లుగా చేసిన కలియుగ పట్టణంలో సినిమా కూడా మార్చి 22వ తేదీన విడుదల కానుంది. అలాగే డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా వస్తున్న టిల్లు స్క్వెర్ సినిమాను మార్చి 29వ తేదీన విడుదల చేయబోతున్నారు. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ లు హీరోహీరోయిన్లుగా కనిపించబోతున్న ఈ సినిమాపై పెద్ద ఎత్తునే అంచనాలు నమోదు అయ్యాయి. అలాగే గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ అనే సినిమా కూడా మార్చి 29వ తేదీనే విడుదల కాబోతుంది.


Click it and Unblock the Notifications











