హీరోగా ఆర్‌బీ చౌదరి తనయుడు.. ఫిబ్రవరిలో ఒకటే లైఫ్ రిలీజ్
సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత ఆర్‌బీ చౌదరి తనయుడు జితన్ రమేష్ హీరోగా లార్డ్ వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై నారాయణ్ రామ్ నిర్మిస్తొన్న చిత్రం 'ఒకటే లైఫ్'. హ్యాండిల్ విత్ కేర్ అనేది ఉప శీర్షిక. ఎం.వెంకట్ దర్శకుడు. శృతి యుగల్ హీరొయిన్‌గా నటిస్తొన్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ సంపాదించుకొన్నది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేయటానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

గతంలో మాజీ మంత్రి హరీష్‌రావు ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఒకటే లైఫ్ సినిమా ట్రైలర్‌కు మంచి ఆదరణ లభించడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

నిర్మాత నారాయణ్ రామ్ మాట్లాడుతూ.. "సెన్సార్ కార్యక్రమాలు పూర్తిఅయ్యాయి. యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించిన విధానం హైలెట్‌గా నిలుస్తుంది. హరీష్ రావుగారు మా ట్రైలర్‌ను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. ట్రైలర్ లు పాటలు చాల బాగావచ్చాయి. ఆర్.బి.చౌదరి తనయుడు జితన్ రమేష్ హీరోగా రావటం తో ఈ సినిమా పై అంచనాలు పెరిగాయి. డిస్ట్రిబ్యూటర్ లు మంచి రేటుకు సినిమా ని అడుగుతున్నారు. 'ఒకటే లైఫ్' సినిమా మంచి విజయం సాధిస్తుంది అని ఆశిస్తున్నాము అని అన్నారు.


Click it and Unblock the Notifications











