సూపర్‌గుడ్ ఫిల్మ్స్ ఆర్‌బి చౌదరి తనయుడు రమేష్ విలన్‌గా 'నిరీక్షణ'
సూపర్‌గుడ్ ఫిలింస్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి పలు భాషల్లో ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలను నిర్మించారు. ఆయన తనయులు రమేష్, జీవా తమిళ్, తెలుగు భాషల్లో హీరోలుగా మంచి పేరు తెచ్చుకున్నారు. 'విద్యార్థి' చిత్రంతో తెలుగులో హీరోగా పరిచయమైన రమేష్ ఆ తర్వాత తమిళంలో పలు హిట్ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.
రమేష్ హీరోగా నటించిన తెలుగు చిత్రం 'ఒకటే లైఫ్'. దీంతో పాటు తాజాగా 'నిరీక్షణ' చిత్రంలో మొదటిసారిగా మెయిన్ విలన్‌గా నటిస్తున్నారు. సాయిరోనక్, ఎనా సహా హీరోహీరోయిన్లుగా టేక్ ఓకే క్రియేషన్స్ పతాకంపై వంశీకృష్ణ మళ్ళ దర్శకత్వంలో రూపొందుతున్న హై ఓల్టేజ్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ 'నిరీక్షణ'.

ఈ చిత్రం ద్వారా రమేష్ విలన్‌గా టర్న్ అయ్యారు. ఇందులో ఇంకా శ్రద్ధా దాస్, సన స్పెషల్ క్యారెక్టర్స్‌లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇకపై పలు చిత్రాలతో పాటు తమిళంలో విలన్ పాత్రలు చేయడానికి రమేష్ సిద్దంగా ఉన్నట్లు వెల్లడించారు.
సాయి రోనక్, ఎనా సహా, రమేష్ నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను, అజయ్ ఘోష్, మధుసూదన్, వేణు, హర్ష తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: రవి వి., సంగీతం: మంత్ర ఆనంద్, పాటలు: చంద్రబోస్, ఎడిటింగ్: నందమూరి హరి, నిర్మాణం: టేక్ ఓకే క్రియేషన్స్, దర్శకత్వం: వంశీకృష్ణ మళ్ళ.


Click it and Unblock the Notifications











