Ram Charan న్యూ లుక్ వైరల్.. సరికొత్త గెటప్ లో కిక్ ఇచ్చిన మెగా పవర్ స్టార్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 15వ సినిమాను శంకర్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై కూడా అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ హై బడ్జెట్ సినిమాలో కీయరా అద్వానీ మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ఎప్పుడూ విడుదల చేస్తారు అని ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో రామ్ చరణ్ కు సంబంధించిన ఒక ప్రత్యేకమైన లుక్ ను రీసెంట్ గా విడుదల చేశారు.

మంచి సందేశంతో..

మంచి సందేశంతో..

RRR సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న రామ్ చరణ్ మళ్లీ మరో పాన్ ఇండియా మూవీతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చూపించాలనే సిద్ధమవుతున్నాడు. శంకర్ దర్శకత్వంలో దొరికేకుతున్న రామ్ చరణ్ కొత్త మూవీ పై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ యాక్షన్ సోషల్ డ్రామాగా మంచి సందేశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 విభిన్నమైన లుక్స్

విభిన్నమైన లుక్స్

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ పలు విభిన్నమైన లుక్స్ కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇదివరకే సినిమాకు సంబంధించిన చాలా ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అందులో రామ్ చరణ్ గతంలో ఎప్పుడు కనిపించనంత కొత్తగా కనిపించబోతున్నట్లుగా అనిపించింది. అయితే రీసెంట్ గా మరొక కొత్త లుక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

న్యూ లుక్ వైరల్

న్యూ లుక్ వైరల్

శంకర్ రామ్ చరణ్ సినిమాకు వర్క్ చేస్తున్న ప్రముఖ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్, రామ్ చరణ్ ను సరికొత్తగా చూపించబోతున్నట్లు వివరణ ఇచ్చాడు. సోషల్ మీడియా ద్వారా ఒక వీడియోని విడుదల చేసిన అతను రామ్ చరణ్ లుక్ హైలెట్ కాబోతున్నట్లు చెప్పకనే చెప్పేశాడు. లైటింగ్ షాడో లో రామ్ చరణ్ ఫేస్ లుక్ గతంలో ఎప్పుడు చూడని విధంగా ఉంది. దర్శకుడు శంకర్ ఎలాంటి హీరోతో వర్క్ చేసినా కూడా అతన్ని మాస్ ఇమేజ్కు తగ్గట్టుగానే స్టైలిష్ చూపిస్తూ ఉంటాడు. ఇక చరణ్ ని కూడా చాలా కొత్తగా చూపించబోతున్నట్లు అర్థమవుతుంది.

 టీజర్ ఎప్పుడంటే?

టీజర్ ఎప్పుడంటే?

ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న రామ్ చరణ్ న్యూ లుక్ అయితే విడుదల అయ్యింది. అయితే ఫస్ట్ లుక్ అలాగే టైటిల్ టీజర్ కోసం కూడా ప్రేక్షకులు ఎంత ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అసలైతే గత నెలలోనే దర్శకుడు శంకర్ ఒక టీజర్ ను విడుదల చేయాలని అనుకున్నాడు. కానీ షూటింగ్ పనులు చాలా వరకు బ్యాలెన్స్ ఉండడంతో ఏమాత్రం తీరిక దొరకడం లేదట. ఇక వచ్చే నెలలోనే ఆగస్టు 15వ తేదీన ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేస్తారు అని సమాచారం.

సినిమా రిలీజ్ డేట్?

సినిమా రిలీజ్ డేట్?

ఇక సినిమాను ఎప్పుడు రిలీక్ చేస్తారు అనే విషయంలో ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు. అసలైతే మొదట 2023 సంక్రాంతికి విడుదల చేయాలి అని ఒక ప్రణాళికను రచించుకున్నారు. దిల్ రాజు కూడా అప్పుడే విడుదల చేయాలని ఫిక్స్ అయ్యాడు. కానీ షూటింగ్ పనులు చాలా వరకు బ్యాలెన్స్ ఉండడంతో ఆ సమయానికి వచ్చే అవకాశం లేదు అని తెలుస్తోంది. ఇక కుదిరితే వచ్చే ఏడాది సమ్మర్ లోనే విడుదల చేయాలని అనుకుంటున్నారట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X