అనుకున్నంతా అయింది.. RC15 నుంచి వీడియో లీక్.. సైకిలెక్కిన చరణ్.. మాములుగా లేదుగా!

గత కొద్ది రోజులుగా సినీ పరిశ్రమకు పలు రకాలుగా ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఇండస్ట్రీ ఏపీలో టికెట్ రేట్ల వ్యవహారంలో కూడా ఇబ్బందులు పడిన పరిస్థితి. అయితే ఇప్పుడిప్పుడే కొంచెం సెట్ అవుతున్న క్రమంలో పైరసీ సహా లీకేజీ కష్టాలు వచ్చాయి. భారీ బడ్జెట్‏తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాలకు లీకుల టెన్షన్ పట్టుకుంది.

ఇటీవల మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా నుంచి ఏకంగా కళావతి సాంగ్ కూడా సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ముందు జాగ్రత్త అపడిన రామ్ చరణ్ సినిమా యూనిట్ హెచ్చరించింది కూడా. అయితే అనుకోకుండా ఆ సినిమా నుంచి ఏకంగా వీడియో లీక్ అయింది. ఆ వివరాలు

 స్ట్రాంగ్ వార్నింగ్

స్ట్రాంగ్ వార్నింగ్

తమ తమ సినిమాల చిత్రాల పట్ల మేకర్స్ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ లీక్ కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో ఎందుకైనా మంచిది అని ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ సంస్థ లీక్ రాయుళ్లకు మొన్నీమధ్యనే సోషల్ మీడియా ద్వారా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

చెక్ పెట్టే ప్రయత్నం

చెక్ పెట్టే ప్రయత్నం

"RC 15, SVC 50 చిత్రీకరణ సినిమా అవసరాలకు అనుగుణంగా బహిరంగా ప్రదేశాల్లో జనసందోహంతో జరుగుతుంది. ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలి. చట్ట విరుద్ధంగా తీసిన వీడియోస్, ఫోటోస్ నెట్టింట్లో షేర్ చేయకూడదని కోరుతున్నాము. అనధికారిక కంటెంట్ పోస్ట్ చేసే ఐడీలపై మా యాంటీ వైరస్ టీమ్ చర్య తీసుకుంటుంది" అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు మేకర్స్. మొత్తానికి ఇటీవల ఎక్కువవుతున్న లీక్స్ బెడదకు ముందుగానే చెక్ పెట్టే ప్రయత్నం చేసింది.

సెట్స్ పై

సెట్స్ పై

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రామ్ చరణ్ కియారా అద్వానీ నటిస్తుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. గతంలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ పై ఉంది.

రామ్ చరణ్ ఏనా?

అయితే అనుకున్నంతా అయింది. రామ్ చరణ్ RC15 రాజమహేంద్రవరంలో షూటింగ్ జరుపుకుంటోంది. ఆ షూటింగ్ నుంచి ఒక వీడియో లీక్ అయింది. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఈ వీడియో లీక్‌పై రామ్ చరణ్ అభిమానులు ఉలిక్కిపడుతున్నారు. చిన్న క్లిప్‌లో రామ్ చరణ్ సైకిల్ తొక్కుతున్నట్లు కనిపిస్తోంది. అయితే వీడియో అస్పష్టంగా ఉన్నందున అది రామ్ చరణ్ ఏనా? లేక ఇంకా ఎవరైనానా అనేది తెలియాల్సి ఉంది. అయితే, చిన్న క్లిప్‌ని విస్తృతంగా షేర్ చేస్తున్నారు అభిమానులు.

 కొత్త అనుమానం

కొత్త అనుమానం

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. లీక్డ్ వీడియో చూసిన తర్వాత ఈ కొత్త అనుమానం మొదలయింది. #RC15 కంప్లీట్ గా భారతేయుడు టైపులో ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఇందులో నిజానిజాలు ఈమేరకు ఉన్నాయనేది రిలీజ్ అయిన తరువాతే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X