మంత్రి కేటీఆర్ తో నటుడు సోనూసూద్ భేటీ.. ఆ దర్శకులతో కలిసి స్పెషల్ లంచ్!

గత ఏడాది దేశంలో కరోనా ఎంటర్ అయినప్పటి నుంచి రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు సోనూ సూద్ ఈ రోజు ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ను కలవడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసమైన ప్రగతి భవన్ కి వెళ్ళిన సోనూసూద్ మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో సోనూ సూద్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల గురించి మాట్లాడిన కేటిఆర్ ఈ విషయం మీద సోను సూద్ ను అభినందించారు.

దేశ వ్యాప్తంగా నలుమూలల నుంచి విజ్ఞప్తులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అవసరమైన వాటికి స్పందిస్తూ సోనూసూద్ చేస్తున్న సేవ గురించి మంత్రి కేటీఆర్ కొన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో సోనూ సూద్ తాను చేస్తున్న సేవా కార్యక్రమాలకు సంబంధించిన కొన్ని వివరాలు సేవా రంగంలో తన ఫ్యూచర్ ప్లాన్స్ ని మంత్రి కేటీఆర్ తో పంచుకున్నారు. ఇక తల్లి స్ఫూర్తితో ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నానని పేర్కొన్న సోనూసూద్ హైదరాబాద్ తో తనకున్న అనుబంధం గురించి ఇక్కడి వారి పట్ల తనకు ఉన్న ప్రేమ గురించి కూడా పంచుకున్నారు.

ఒక రాజకీయ నాయకుడిగా తెలంగాణకు ప్రపంచ స్థాయి కంపెనీలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తూనే మిగతా నాయకులకంటే భిన్నంగా ఉంటూ కష్ట సమయాల్లో వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండే కేటీఆర్ అంటే తనకు చాలా అభిమానమని సోనూసూద్ పేర్కొన్నారు.

Real hero Sonu Sood met IT Minster KTR at pragathi bhavan

ఆపద సమయాల్లో సాయం కోరిన వారిని ఆదుకుంటున్న కేటీఆర్ అంటే తనకు గౌరవం ఎక్కువని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఈ భేటీ అనంతరం మంత్రి కేటీఆర్ సోనూసూద్ కి లంచ్ ఏర్పాటు చేశారు. లంచ్ పూర్తి అయిన తర్వాత కేటీఆర్ సోనూసూద్ ని అభినందిస్తూ ఒక శాలువాతో సత్కరించి ఒక జ్ఞాపికను కూడా అందజేశారు. ఈ భేటీలో దర్శకులు మెహర్ రమేష్, వంశీ పైడిపల్లి కూడా పాల్గొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X