ఆశా భోంస్లే మృతికి కారణం ఏమిటో తెలుసా? డాక్టర్లు వెల్లడించిన వాస్తవం ఇదే!

లెజండరీ సింగర్ ఆశా భోంస్లే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. 80 ఏళ్లకుపైగా సంగీత ప్రపంచానికి విశేష సేవలు అందించిన దిగ్గజ గాయని అనారోగ్యానికి గురై మృతి చెందారు. వృద్దాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆమె ఇన్‌ఫెక్షన్స్ గురయ్యారు. దాంతో ఆమెను ఇటీవల ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో మెరుగైన చికిత్స కోసం చేర్పించారు. అయితే చికిత్స పొందుతున్న సమయంలో గుండెపోటు గురై ఆమె మరణించారు అని కుటుంబ సభ్యులు అధికారికంగా వెల్లడించారు.

ఆశా భోంస్లే మృతి వార్తతో సంగీత అభిమానులు, సినీ ప్రముఖులు, స్నేహితులు, సన్నిహితులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఎన్నో ఏళ్ల నుంచి తన పాటలను ఆస్వాదించిన సంగీత ప్రియులు ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురయ్యారు. ఆమె ఆకస్మిక మరణానికి కారణం ఏమిటి? దిగ్గజ గాయని మృతికి కారణమైన ఆరోగ్య సమస్యలు ఏమిటి అనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ప్రఖ్యాత వైద్యులు వెల్లడించిన సమాచారం వివరాల్లోకి వెళితే..

Reason Behind Asha Bhosle Death

ఫార్టీస్ ఎస్కార్ట్ హాస్పిటల్ వైద్యుడు డాక్టర్ రవి శేఖర్ ఝా వెల్లడించిన వివరాల ప్రకారం.. సాధారణంగా వయోవృద్ధులకు ఛాతీలో ఇన్‌ఫెక్షన్ సహజం. అందుకొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి. వయసుపై బడిన వారిన శరీరం బలహీనంగా మారుతుంది. దగ్గుకు సంబంధించిన సమస్యలు వస్తాయి. వారు బలంగా దగ్గలేకపోతారు. దాంతో క్రిములు శరీరం నుంచి బయటకు వెళ్లవు. కొన్నిసార్లు ఆహార పదార్థాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంటాయి. ఆ పరిస్థితి తీవ్ర ఆనారోగ్యానికి దారి తీస్తాయి. ఇలాంటి ఇన్‌ఫెక్షన్స్ ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

వయసు పైబడిన వారు ఎక్కువ సమయం పడుకోవడం వల్ల లేదా కూర్చొని ఉండటం వల్ల.. ఊపిరితిత్తులు ఎక్స్‌పాండ్ కావు. దాంతో ఊపిరితిత్లుల్లోని కింది భాగాలకు శ్వాస అందక సమస్యలు ఏర్పడుతాయి. ఇన్‌ఫెక్షన్ తొందరగా సోకడానికి ఈ పరిస్థితులు దారి తీస్తాయి. దాంతో COPD, హృదయ సంబంధిత వ్యాధులు, డయాబెటీస్, అలాంటి హనీకరమైన వ్యాధుల బారిన పడుతారు అని రవి శేఖర్ వెల్లడించారు. ఇలాంటి ఇన్‌ఫెక్షన్ సోకిన వారు జ్వరం, దగ్గుతో బాధపడుతారు. వారి శరీరం బలహీనంగా మారి సహకరించదు. నిద్ర, లేదా మానసిక గందరగోళానికి గురి అవతారు. ఇలాంటి ఇన్‌ఫెక్షన్ బారిన ఆశా భోంస్లే పడ్డారు అని చెప్పారు.

ఇదిలా ఉండగా, బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ నుంచి ఆశా భోంస్లే పార్తీవ దేహాన్ని తన నివాసానికి తీసుకెళ్లారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అభిమానులు, సినీ ప్రముఖుల చివరి చూపు కోసం ఉంచుతారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు శివాజీ పార్కులో దిగ్గజ గాయని అంత్యక్రియలు నిర్వహిస్తున్నాం అని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఆాశా భోంస్లే కెరీర్ విషయానికి వస్తే.. ఆమె సుమారుగా 20కి పైగా భారతీయ భాషల్లో పాటలు పాడారు. పలు విదేశీ భాషల్లో కూడా సాంగ్స్ ఆలపించారు. ఇప్పటి వరకు సుమారుగా 12000 పాటలకుపైగా పాడటం విశేషంగా చెప్పుకోవాలి. గాయనిగానే కాకుండా మాయి అనే చిత్రంలో నటిగా కూడా నటించారు. తన ప్రొఫెషనల్ జీవితంలో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, పద్మ భూషణ్ లాంటి విశిష్ట పురస్కారాలను అందుకొన్నారు. అత్యధిక పాటలు పాడిన గాయనిగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో కూడా చోటు సంపాదించుకొన్నారు.

Read more about: asha bhosle bollywood death
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X