Chandra Mohan Death ఆ నిర్లక్ష్యంతోనే చంద్రమోహన్ ఆరోగ్యం క్షీణించిందా? ఆయన మృతికి కారణం ఏమిటంటే?

తెలుగు సినిమా ప్రపంచంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ తరాలతోపాటు నేటి తరం హీరోలతో నటించిన అతికొద్ది మంది నటుల్లో చంద్రమోహన్ ఒకరు.దాదాపు ఆయన నట జీవితం 50 సంవత్సరాలకుపైగా సాగింది. అలాంటి సీనియర్ నటుడు ఇకలేరంటే అభిమానులు, సినీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నారు. సినిమాలపై ప్రేమ, మక్కువ కారణంగానే ఆయన తన ఆరోగ్యాన్ని నిర్లక్షం చేసుకొన్నారా? అంటే స్వయంగా ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయాల్లోకి వెళితే...

చంద్రమోహన్ నట జీవితాన్ని పరిశీలిస్తే.. ఆయన కెరీర్ గ్రాఫ్ అద్బుతంగా కనిపిస్తుంది. చిన్న పాత్రలతో నటుడిగా రాణించిన ఆయన హీరోగా రెండు దశాబ్దాలకుపైగా తన జర్నీని కొనసాగించారు. హీరోగా ఆదరించడం లేదనే విషయాన్ని గ్రహించిన ఆయన వెంటనే క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయారు. అలా ఆయన బలాలు, బలహీనతలను గుర్తించడంలో ఆయనకు ఆయనే సాటి అని చెప్పుకొంటారు.

Reason behind Chandra Mohans Death: Actor neglected his health amid Shooting busy?

సినిమా పరిశ్రమలో చోటు చేసుకొనే పరిస్థితులు, అభిమానుల అభిరుచికి తగినట్టుగా నటులు మారాలి. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే యాక్టర్ ఆల్ రౌండర్‌గా మారాలి.హీరోగానే చేయాలనే రూల్ పెట్టుకోవద్దు. అలా చేయడం వల్లే నేను సుదీర్ఘకాలం ఇండస్ట్రీలో ఉన్నాను.50 ఏళ్లపాటు నేను నటుడిగా కొనసాగాను అని చంద్రమోహన్ అన్నారు.

1966 సంవత్సరం నుంచి నిరంతరం నేను షూటింగులు, సినిమాలతో బిజీగా ఉన్నాను. ఆ సమయంలో నేను నా ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించాను. ఆ సమయంలో ఎవరైనా హెచ్చరిస్తే.. ఇనుముకు చెదలు పడుతుందా? అని అనేవాడిని. ఆ నిర్లక్ష్యమే నన్ను దెబ్బ తీసింది. అలా ధీమాగా ఉన్న సమయంలో నాకు గుండెలో సమస్య వచ్చింది అని చంద్రమోహన్ చెప్పారు.

Reason behind Chandra Mohans Death: Actor neglected his health amid Shooting busy?

జూనియర్ ఎన్టీఆర్ నటించిన రాఖీ సినిమాలో ఓ ఎమోషనల్ సీన్ చేసి వచ్చిన తర్వాత గుండెలో సమస్యగా అనిపించింది. వెంటనే నేను చెక్ చేయించుకొంటే బైపాస్ సర్జరీ తప్పదుని వైద్యులు చెప్పారు. దాంతో హాస్పిటల్‌లో బైపాస్ సర్జరీ చేయించుకొన్నాను. నావల్ల దువ్వాడ జగన్నాథం సినిమా షూటింగ్ వాయిదా పడింది. నా నిర్మాతలు ఇబ్బంది పడొద్దని నేను రిటైర్మెంట్ తీసుకొన్నాను అని చంద్రమోహన్ చెప్పారు.

చంద్రమోహన్ కొద్దికాలంగా వృద్దాప్య సంబంధింత సమస్యలతో బాధపడుతున్నారు. కిడ్నీలో సమస్యలు తలెత్తడంతో రెగ్యులర్‌‌గా డయాలిసిస్ జరుగుతున్నది. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన మృతితో తెలుగు సినిమా పరిశ్రమలో ఓ అధ్యాయం ముగిసిందని ఆయన అభిమానులు చెప్పుకొంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X