Prabhas: 'ప్రభాస్'కు అలా అన్యాయం చేశా .. కృష్ణవంశీ నుంచి అసలు నిజం

ఏ సినిమాకి అయినా కూడా సగటు సినీ ప్రేక్షకుడు ఒక సుఖాంతంనే కోరుకుంటాడు. కానీ అందుకు భిన్నంగా హృదయాన్ని కదిలించే ఎండింగ్ ఇచ్చినా ఒక స్టార్ హీరోపై కొంచెం ప్రయోగాత్మక క్లైమాక్స్ లు ప్లాన్ చేసినా కూడా బెడిసి కొట్టిన సందర్భాలు సినిమాలు చాలానే కనిపిస్తాయి. కాగా ఇలా మన తెలుగు సినిమాలో కూడా చాలా లేకపోలేవు.

ఎక్కడి వరకో ఎందుకు గతంలో మెగాస్టార్ చిరంజీవిపై డాడీ అనే సినిమాలో తన స్నేహితుని చేతిలో దారుణంగా మోసపోవడం అనే సన్నివేశంతోనే మెగా అభిమానులు ఎంతో హర్ట్ అయ్యారు. ఇలా పలు సన్నివేశాలు డెఫినెట్ గా ఆయా సినిమాల ఫలితాలని మార్చేస్తూ ఉంటాయి. అయితే ఇపుడు కొంచెం హార్ట్ బ్రేకింగ్ ఉన్న క్లైమాక్స్ ఉన్నాసరే పలు సినిమాలు బాగానే రన్ అవుతున్నాయి కానీ ఒకపుడు ఈ పరిస్థితులు లేవు.

Reason behind prabhas character killed in chakram movie director Krishna Vamshi revealed facts

అలా ప్లాప్ అయ్యిన కొన్ని చిత్రాల్లో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్రయోగాత్మక ఎమోషనల్ చిత్రం "చక్రం" కూడా ఒకటి. కాగా అప్పటికే ప్రభాస్ యువకుడు అయినప్పటికీ మాస్ లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నాడు. కాగా అప్పుడులో దర్శకుడు కృష్ణవంశీ అంటే కూడా తెలుగు ఆడియెన్స్ లో టాలీవుడ్ లో మంచి ఫేమ్ ఉంది. మరి అలాంటి దర్శకునితో సినిమా అంటే ప్రభాస్ కి ఛాలెంజింగ్ నే..

కాగా అలా వారి నుంచి వచ్చిన చక్రం సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్ తో పాటుగా మంచి సందేశాన్ని కూడా అందించారు. కానీ ఆ సినిమాలో ప్రభాస్ పోషించిన చక్రం పాత్రని క్లైమాక్స్ లో చంపెయ్యడం అనేది తెలుగు ఆడియెన్స్ కి అప్పుడు ఎక్కలేదు. దీనితో అంతా బాగానే ఉంది అనుకున్న సినిమా కాస్తా ప్లాప్ అయ్యింది.

అయితే అసలు ప్రభాస్ ని ఆ సినిమాలో ఎందుకు చంపెయ్యాల్సి వచ్చిందో దర్శకుడు కృష్ణవంశీ రివీల్ చేశారు. కాగా చక్రం క్లైమాక్స్ లో ప్రభాస్ రోల్ చనిపోకుండా ఉండాల్సింది అనే ప్రశ్నకి అద్భుతమైన సమాధానం అందించారు. "ఎవరికి అయినా సరే మరణం తప్పదు అని ఒక అద్భుతమైన జీవిత సత్యాన్ని గురించి సినిమా తీస్తున్నప్పుడు ఆ మరణం చూపించకపోవడం, అందువల్ల వచ్చే విజయం 'సరి' అనిపించలేదండి.. క్షమించండి" అంటూ ఒక ఎమోషనల్ ఆన్సర్ ని అందించారు.

దీనితో అలా చక్రం రోల్ ని చంపాల్సి వచ్చింది. ఒకవేళ చంపకుండా వచ్చే విజయాన్ని తాను తీసుకోదలచుకోలేదు అంటూ ఇచ్చిన సమాధానం ఇపుడు ప్రభాస్ ఫ్యాన్స్ ని సైతం కదిలించింది. మరి ప్రస్తుతం చాలామంది కృష్ణ వంశీ నెక్స్ట్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు కానీ తన దగ్గర కథలు ఉన్నప్పటికీ నిర్మాతలు దొరకట్లేదని తాను అంటున్నారు. మరి చూడాలి తన నుంచి మళ్ళీ ఎపుడు సినిమా వస్తుంది అనేది. ఇక ప్రభాస్ ఇపుడు ఏ రేంజ్ సినిమాలు చేస్తున్నాడో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం దర్శకుడు మారుతీతో ది రాజా సాబ్ సినిమా అలాగే దర్శకుడు హను రాఘవాపుడితో ఓ సినిమా చేస్తున్నాడు.

More from Filmibeat

Read more about: prabhas chakram krishna vamsi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X