Rakesh Master Death రాకేష్ మాస్టర్ యాసిడ్ తాగాడా? మరణం వెనుక అసలు కారణం చెప్పిన సోదరుడు
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఆకస్మిక మరణం సినీ పరిశ్రమను విషాదంలోకి నెట్టింది. ఆయన ఇకలేరనే విషయం తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. అయితే షుగర్ లెవెల్స్ పెరగడం, బీపీ పడిపోవడం లాంటి సమస్యలు అలాగే పలు అవయవాలు వైఫల్యం లాంటి సమస్యలతో ఆయన మరణించినట్టు వైద్యులు వెల్లడించారు. అయితే రాకేష్ మాస్టర్ మరణంపై ఆయన సోదరుడు సంచలన విషయాలను బయటపెట్టారు. ఆయన చెప్పిన విషయాలల్లోకి వెళితే..
రాకేష్ మాస్టర్ స్వతహాగా మంచి వాడు. మద్యం సేవించిన తర్వాత చాలా మందితో గొడవపడేవాడు. భార్య పిల్లలతోనే కాకుండా శేఖర్ మాస్టర్‌తో కూడా అలానే గొడవపడ్డారు. తాగినది దిగిన తర్వాత ఉదయం వారికి క్షమాపణ చెప్పేవారు. రాకేష్ మాస్టర్ తండ్రి అభ్యుదయవాది. పుచ్చలపల్లి సుందరయ్యకు సన్నిహితుడు. అందువల్లే రాకేష్ మాస్టర్ పేరును రామిరెడ్డి నుంచి రాకేష్‌గా మార్చారు అని సోదరుడు తెలిపారు.

రాకేష్ మాస్టర్‌కు ఆరోగ్యం క్షీణించడంతో ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించారు. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందుల కారణంగా గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. షుగర్ పెరిగి, బీపీ తగ్గిపోయింది. ఒక రోజు ముందే నాకు బతకడం కష్టమే అని చెప్పాను. వారి భార్య, పిల్లలకు సమాచారం అందించాను. వచ్చి చివరి చూపు చూసుకోమని చెప్పాను అని రాకేష్ మాస్టర్ చెప్పారు.
గాంధీ హాస్పిటల్‌లో ఆక్సిజన్ పైపు నోట్లో నుంచి పెట్టే సమయంలో పెదాలు నల్లగా మారిపోయాయి. ఆ పెదాలను చూసి డాక్టర్లు భయపడిపోయారు. వెంటనే యాసిడ్ తాగిన కేసు అని వైద్యులు అన్నారు. దాంతో నేను షాక్ తిన్నాను. అప్పుడు నాకు రాకేష్ మాస్టర్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. నేను బతికినంత సేపు ఆనందంగా బతుకుతాను. బతకలేని పరిస్థితుల్లో ప్రాణం తీసుకొంటానని అన్నాడు. అలాంటి ప్రయత్నమేమైనా చేశాడా అనే అనుమానం కలిగింది అని రాకేష్ మాస్టర్ సోదరుడు అన్నారు.
అయితే యాసిడ్ తాగాడా అనే విషయంపై వైద్య నిపుణులను అడిగి తెలుసుకొన్నాను. యాసిడ్ తాగితే పెదవులు కమిలిపోతాయి. కానీ రాకేష్ విషయంలో యాసిడ్ తాగలేదు. తాగి ఉంటే అతడి పరిస్థితి అలా ఉండేది కాదు. చివరి నిమిషంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. వైద్య నిపుణులు కూడా యాసిడ్ తాగలేదు. షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల అవయవాలు పనిచేయలేవని అని రాకేష్ మాస్టర్ సోదరుడు చెప్పారు.
గాంధీ హాస్పిటల్‌లో ఉండగానే రాకేష్ మాస్టర్ భార్య, కూతురు వచ్చారు. భార్య మాట వినగానే వెంటనే రాకేష్ మాస్టర్ లేచి కూర్చునే ప్రయత్నం చేశాడు. కానీ లేవలేకపోయాడు. భార్య స్పర్శ తగలగానే వెంటనే కళ్లు తెరిచి చూశాడు. చివరిగా నా భార్య.. నా దేవతతో మాట్లాడించమని అడిగాడు అని రాకేష్ మాస్టర్ చెప్పారు.


Click it and Unblock the Notifications











