త్రిషతో మహేశ్ బాబు లిక్‌లాక్ వెనుక.. కారణం అదే.. స్టార్ డైరెక్టర్‌కి షాకింగ్ కామెంట్
భారతీయ చిత్ర పరిశ్రమకు రామ్ గోపాల్ వర్మ పరిచయం చేసిన విలక్షణ దర్శకుల్లో కృష్ణవంశీ ఒకరు. సామాజిక అంశాలు, దేశభక్తి, సంస్కృతి, సాంప్రదాయాలు, కుటుంబ సంబంధాలు ఆయన సినిమాల్లో కనిపిస్తాయి. కృష్ణవంశీలోని ప్రతిభ, చురుకుదనం గమనించిన వర్మ.. తనే ప్రొడ్యూసర్‌గా గులాబీ చిత్రం ద్వారా దర్శకుడిని చేశారు. నిన్నే పెళ్లాడతా, సింధూరం, అంత:పురం, సముద్రం, మురారి, ఖడ్గం, శ్రీ ఆంజనేయం, చక్రం, డేంజర్, రాఖీ, చందమామ, మహాత్మ, గోవిందుడు అందరివాడే వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తన మార్క్ చూపించారు. ఈ మధ్య ఎందుకో కృష్ణవంశీ జోరు తగ్గింది అనుకునేలోగా గతేడాది రంగమార్తాండతో వచ్చి మామ - కోడలు, మామ- అల్లుడు, తండ్రి- కూతురు, మిత్రుల మధ్య అనుబంధాన్ని గొప్పగా ఆవిష్కరించారు.
ఆయన ప్రతి సినిమాలోనూ ఎంతో పరిణితి కనిపిస్తుంది. ఇప్పటికీ తనను తాను మార్చుకుంటూ వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు కృష్ణవంశీ. తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్లను అందంగా చూపించే డైరెక్టర్లలో దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు తర్వాతి స్థానం కృష్ణవంశీదే. ముఖ్యంగా రొమాంటిక్ సాంగ్స్ తీయడంలో ఆయనకు ఆయనే సాటి. తన చిత్రాల్లో పనిచేసిన సంఘవి, మహేశ్వరి, సోనాలి బింద్రే, రమ్యకృష్ణ, సౌందర్య, ఛార్మి, కాజల్ అగర్వాల్, జెనీలియా, భావన, అనుష్క శెట్టి అందాలను స్క్రీన్‌పై అద్భుతంగా ఆవిష్కరించారు కృష్ణవంశీ. ఈ సినిమాలు ఆయా హీరోయిన్ల కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడ్డాయి.

ఇదిలాఉండగా.. సూపర్‌స్టార్ మహేశ్ బాబు కెరీర్‌లో అతడు సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మహేశ్ కెరీర్‌తో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో క్లాసిక్‌గా మిగిలిపోయింది. సాధారణంగా ఒక సినిమాను ఒకసారి మాత్రమే చూస్తారు.. అభిమానులైతే రెండు మూడు సార్లు. కానీ అతడు మూవీని 20 ఏళ్లుగా తెలుగువారు ఎన్నిసార్లు చూసారో లెక్కే లేదు. వెండితెర కంటే బుల్లితెరపై అతడు ప్రభంజనం సృష్టించింది.
స్వతహాగా మంచివాడైన ఓ కుర్రాడు.. పరిస్ధితుల ప్రభావం కారణంగా సుపారీ కిల్లర్‌గా, మిత్రుడి వెన్నుపోటు వలన ఇంకొకరి ఇంట్లో మారుపేరుతో తలదాచుకుంటాడు. మిత్రుడు చేసిన మోసం, ఈ ప్రాసెస్‌లో తన వల్ల ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి కుటుంబాన్ని ఆదుకున్నాడు, తన నిర్దోషిత్వాన్ని ఎలా రుజువు చేసుకున్నాడన్నదే అతడు కథ. త్రివిక్రమ్ డైలాగ్స్, మహేశ్ నటన, మణిశర్మ సంగీతం, పీటర్ హెయిన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాను మరో మెట్టుపైకెక్కించాయి.

అప్పట్లో రొమాంటిక్ సీన్లకు మహేశ్ దూరంగా ఉండేవారు. అలాంటిది 'పిలిచినా రానాంటావా' సాంగ్‌లో త్రిషతో లిప్ లాక్, ఆమె నడుము గిల్లడం చేసి షాకిచ్చారు. బావా మరదళ్ల మధ్య అలాంటి సరసాలు కామన్ కాబట్టి ఆ సాంగ్ సూపర్‌హిట్ అయ్యింది. అయితే ఇలాంటి గ్రాండియర్ లుక్స్, ఇంటినిండా జనాలు, రొమాంటిక్ టచ్ ఇవ్వడంలో కృష్ణవంశీ స్పెషలిస్ట్. మురారి రీరిలీజ్ నెటిజన్లతో ఆయన ఎక్స్‌లో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో అతడులోని ఈ సాంగ్‌కి కొరియోగ్రఫి మీరే చేశారా అంటూ ఓ వ్యక్తి కృష్ణవంశీని ప్రశ్నించాగా.. తానేం చేయలేదని బదులిచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











