రహస్యంగా నడిపిస్తున్న రాజమౌళి.. అసలేం జరుగుతోంది..?

Recommended Video

Rajamouli Decides To Keep Low Buzz On RRR Movie || Filmibeat Telugu

బాహుబలి సినిమాతో వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ అయ్యారు ఎస్ఎస్ రాజమౌళి. సినిమాలు తీయడంలో తెలుగోడి సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పారు. దీంతో అప్పటికే బడా డైరెక్టర్ గా పేరొందిన రాజమౌళి బాహుబలి తర్వాత అన్ని వర్గాల ప్రేక్షకులకు క్రేజ్రీ డైరెక్టర్ అయ్యారు. ఈ నేపథ్యంలో రాజమౌళి తదుపరి ప్రాజెక్ట్ పై భారీ హైప్ నెలకొంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తన తదుపరి సినిమా చేస్తున్నారు. ముందుగా ప్రెస్ మీట్ పెట్టి ఈ సినిమా వివరాలు ప్రకటించిన జక్కన్న.. ఇప్పుడు మాత్రం చాలా రహస్యంగా ఉంటున్నారు. దీనికి కారణాలేంటి? ఎన్నడూ లేనట్లుగా దర్శక దీరుడిలో ఈ మార్పు ఎందుకొచ్చింది? వివరాల్లోకెళితే..

'ఆర్ఆర్ఆర్'.. మీడియాలో చర్చ

'ఆర్ఆర్ఆర్'.. మీడియాలో చర్చ

రాజమౌళి ఎప్పుడైతే 'ఆర్ఆర్ఆర్' ప్రాజెక్ట్ ప్రకటించారో అప్పటి నుంచే మీడియాలో ఓ రేంజ్ చర్చలు ఊపందుకున్నాయి. అందునా స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ కావడంతో ఈ సినిమాపై ప్రచారాలు ఆకాశాన్నంటాయి. 'ఆర్ఆర్ఆర్' భారీ హైప్ నెలకొనడంతో ఎవ్వరికి తోచిన విధంగా వారు పుకార్లు పుట్టిస్తూ ఇప్పటికే ఉన్న చర్చలకు రెక్కలు కడుతున్నారు.

చూసి చూసి.. జక్కన్న ఇలా డిసైడ్ అయ్యారుc

చూసి చూసి.. జక్కన్న ఇలా డిసైడ్ అయ్యారుc

'ఆర్ఆర్ఆర్' సినిమాకు సంబంధించి పబ్లిసిటీ అవసరానికి మించి జరుగుతోందని రాజమౌళి భావిస్తున్నారట. అందుకే గత కొంతకాలంగా ఆయన పూర్తిగా సీక్రెట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. ఎన్ని వార్తలు షికార్లు చేసినా ఏ మాత్రం స్పందించడం లేదు. ఇమ్మడి ముమ్మడిగా వస్తున్న వార్తలపై స్పందిస్తే అనవసర రచ్చకి దారి తీస్తుందని ఆయన ఇలా డిసైడ్ అయ్యారట. ప్రస్తుతం ఆయన ఎక్కడ కూడా 'ట్రిపుల్ ఆర్' చర్చ లేకుండా జాగ్రత్త పడుతుండటం విశేషం.

దానికి చెక్ పెట్టేయాలనే..

దానికి చెక్ పెట్టేయాలనే..

'ఆర్ఆర్ఆర్' ప్రారంభం నుంచే ఊహించిన దానికి మించిన పబ్లిసిటీ జరుగుతోంది. కొద్దీ రోజుల క్రిందట చెర్రీ, ఎన్టీఆర్ ఇద్దరూ గాయపడటంతో 'ఆర్ఆర్ఆర్' షెడ్యూల్స్ అన్నీ డిస్టర్బ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్ సమయంలో ఎవరో కొన్ని ఫోటోలు తీసి వాటిని నెట్ లో పెట్టేశారు. దీంతో అనవసర రచ్చ క్రియేట్ అయింది. అదేవిధంగా ఎన్టీఆర్ హీరోయిన్ ఇష్యు ఓ రేంజ్ చర్చలకు దారి తీస్తోంది. ఈ పరిణామాలు గమనించిన జక్కన్న.. వాటికి చెక్ పెట్టేందుకే సైలెంట్ అయ్యారనేది లేటెస్ట్ అప్‌డేట్.

చడీచప్పుడు లేకుండా హైదరాబాద్ లోనే..

చడీచప్పుడు లేకుండా హైదరాబాద్ లోనే..

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ చడీచప్పుడు లేకుండా హైదరాబాద్ లోనే జరుగుతోంది. సినిమా సెట్స్ పైకి మొబైల్ ఫోన్స్‌, ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా అనుమతించడం లేదట జక్కన్న. దీంతో నెట్టింట కాస్త హడావిడి తగ్గింది. సాధారణంగా దర్శక నిర్మాతలకు పబ్లిసిటీనే ప్రధాన బలం. అలాంటిది రాజమౌళి మాత్రం ఇలా డిఫెరెంట్ వే లో వెళ్తున్నాడంటే ఆర్ఆర్ఆర్ సినిమాపై ఆయనకు ఎంత నమ్మకముందో అర్థం చేసుకోవచ్చు.

ఆర్ఆర్ఆర్ మూవీ

ఆర్ఆర్ఆర్ మూవీ

1920 బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు రోల్ పోషిస్తున్నారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రాన్ని జులై 30న విడుదల చేయనున్నారు. చిత్రంలో ఆలియా భట్ ఒక హీరోయిన్. మరో హీరోయిన్ పేరు తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Read more about: rrr ram charan rajamouli
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X