రొమాంటిక్ మూడ్‌లో ఉన్న రామ్.. ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే..?
ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన ఊపుతో ఉన్న రామ్.. RED అంటూ మరో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు వస్తున్నాడు. తమిళ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ లుక్స్, స్టైలింగ్ అంతా కొత్తగా ఉండటంతో సినిమాపై అందరూ ఆసక్తికనబరుస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న మూవీ యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు పెంచేసింది.
గత వారమే రెడ్ టీజర్‌ను రిలీజ్ చేయగా.. అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ మేరకు టీజర్ అందర్నీ ఆకట్టుకోవడంతో సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో అప్‌డేట్ వచ్చేసింది.

RED నుంచి మొదటి పాట రాబోతోందని ప్రకటించారు. ఇస్మార్ట్ శంకర్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన మణిశర్మ.. ఈ సినిమాకు అదిరిపోయే సంగీతాన్ని అందించినట్టు తెలుస్తోంది. ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్‌ను మార్చి 6న సాయంత్రం ఐదు గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో రామ్ సరసన నివేదా పేతురాజ్, మాళవిక శర్మ, అమృత నాయర్ నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదలకు సిద్దంగా ఉంది.


Click it and Unblock the Notifications











