NBK107: బాలయ్య సినిమాకు ఊహించని టైటిల్.. ఫ్యాన్స్‌కు నచ్చుతుందా!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లే స్టార్ హీరోల్లో నటసింహా నందమూరి బాలకృష్ణ ఒకరు. సుదీర్ఘ కాలంగా ఇదే విధంగా సాగిపోతోన్న ఆయన.. 'అఖండ' వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత మరింత వేగం పెంచేశారు. ఇందులో భాగంగానే ఈ నందమూరి హీరో ప్రస్తుతం మాస్ డైరెక్టర్‌గా పేరొందిన గోపీచంద్ మలినేనితో సినిమాను చేస్తున్నారు. క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ మూవీపై ఆరంభంలోనే అందరి దృష్టి పడిపోయింది. ఫలితంగా దీనిపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి.
ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. అయితే, మధ్యలో కొన్ని అవాంతరాలు ఎదురు కావడంతో చిత్రీకరణకు బ్రేకులు పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మూవీకి సంబంధించి దాదాపు 80 శాతం పైగా టాకీ పార్టును పూర్తి చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన భాగాన్ని కూడా త్వరలోనే పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే బాలయ్య ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ చిత్రం నుంచి నందమూరి అభిమానులను ఆశ్చర్య పరిచే ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న ఈ మూవీకి సంబంధించిన టైటిల్‌ను ఇంకా ప్రకటించలేదు. కానీ, దీనికి 'జై బాలయ్య' అనే పేరు పెట్టినట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రానికి 'రెడ్డి గారు' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారట. దీనికి సంబంధించిన ప్రకటన కూడా ఈ రెండు మూడు రోజుల్లోనే రాబోతుందని అంటున్నారు. అంతేకాదు, ఈ టైటిల్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుందని టాక్. ఇదిలా ఉండగా.. 'రెడ్డి గారు' అనే టైటిల్ పెడితే నందమూరి ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ మూవీలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ నటిస్తోంది. అలాగే, ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ వంటి స్టార్లు కూడా కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. అలాగే, ఎస్ థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











