వర్మకి పోటీగా టాలీవుడ్ హీరోయిన్.. వారికి అభయం ఇస్తూ పోస్ట్.. ఇంటర్వూ గురించి సంచలనం!

ఒకప్పుడు హీరోయిన్ ల కోసం ఎక్కువగా ఇతర భాషల నుంచి తీసుకురావడానికి ప్రయత్నాలు చేసే వారు దర్శకనిర్మాతలు. కానీ ఇప్పుడు ఇదివరకటితో పోలిస్తే చాలా వరకూ తెలుగు అమ్మాయిలకు అవకాశాలు దక్కుతున్నాయి. అయితే పెద్దస్థాయిలో హీరోయిన్ అవకాశాలు దక్కక పోయినా చిన్న సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు కొంతమంది తెలుగు అమ్మాయిలు. అలా ఎంట్రీ ఇచ్చిన ఒక హీరోయిన్ రామ్ గోపాల్ వర్మను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

విశాఖ భామ

విశాఖ భామ

తెలుగు అమ్మాయిలలో హీరోయిన్ అవకాశాలు అందుకుంటున్న వారిలో రేఖా బోజ్ ఒకరు. వినడానికి ఈ పేరు కూడా నార్త్ ఇండియన్ పేరులానే ఉన్నా ఈమె పక్కా తెలుగు అమ్మాయే. ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖ పట్టణానికి చెందిన ఈ భామ తెలుగులో హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో నటించింది. అయితే ఆ సినిమాలు రిలీజ్ అయ్యాక కూడా పెద్దగా ఆడలేదు. అయితే నటిగా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి

దామిని విల్లాతో క్రేజ్

దామిని విల్లాతో క్రేజ్

తెలుగులో ఆమె చేసిన కలయా తస్మై నమః అనే సినిమా 2016లో రిలీజ్ కాగా రంగీలా అనే సినిమా 2017లో రిలీజ్ అయింది.. ఈ రెండు సినిమాల్లో నటించిన ఆమెకు తర్వాత నాలుగు సినిమాల్లో హీరోయిన్గా అవకాశాలు దక్కాయి. ఆ సినిమాలు దామిని విల్లా, స్వాతి చినుకు సందె వేళలో, మహి, వైశాలి. ఈ అన్ని సినిమాల్లో కంటే ఆమెకు ఎక్కువగా పేరు తెచ్చిపెట్టిన సినిమా దామిని విల్లా. ఒకప్పటి హీరో ఓం ఆదిత్య ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. కరోనా కారణంగా సినిమా వాయిదా పడుతూ వస్తోంది.

 వర్మ ఓటీటీకి పోటీగా

వర్మ ఓటీటీకి పోటీగా

ఇక తాజాగా ఈ భామ సోషల్ మీడియా వేదికగా చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రామ్ గోపాల్ వర్మ ఇటీవల స్పార్క్ అనే ఒక ఓటీటీను లాంచ్ చేయించిన సంగతి. అందులో కంటెంట్ కోసం ఆయన షార్ట్ ఫిలిం కాంటెస్ట్ కూడా పెట్టి అనేక షార్ట్ ఫిలిమ్స్ లను షార్ట్ లిస్ట్ చేసే పనిలో పడ్డారు.

 మెయిల్ ఐడిలు కూడా

మెయిల్ ఐడిలు కూడా

అయితే అక్కడ సెలెక్ట్ కాని ఏ షార్ట్ ఫిలిం అయినా మేం తీసుకుంటాం అని చెబుతూ ప్రతి షార్ట్ ఫిలింకి రెండు వేల రూపాయలు ఇస్తామని ఈ భామ ఆఫర్ చేసింది. అంతేకాక అప్పటికి ఇంకా ఎక్కడ అప్లోడ్ చేసి ఉండకూడదని ఆఫర్ నచ్చిన వాళ్ళు మెయిల్ చేయాలని చెబుతూ మెయిల్ ఐడిలు కూడా ఇచ్చింది.

Recommended Video

Interesting Facts About Rekha | Happy Birthday Rekha
వర్మని ఉద్దేశిస్తూ

వర్మని ఉద్దేశిస్తూ

ఇక నిన్న రామ్ గోపాల్ వర్మ అరియానా గ్లోరీతో చేసిన ఇంటర్వ్యూ గురించి కూడా ఆమె ఆసక్తికర కామెంట్ చేసింది. అయితే నేరుగా ప్రస్తావించక పోయినా రామ్ గోపాల్ వర్మ గురించి కామెంట్ చేసినట్లు అర్థమవుతోంది. ''ఆ ఇంటర్వ్యూ చూశాక ఈ హాలీవుడ్ సినిమా పేరు గుర్తొచ్చింది. I spit on youR GraVe (థూ). RIP Camera Angles.'' అంటూ కామెంట్ చేసింది. ఇక ఈ భామ ఈ మధ్య చేసిన వ్యాక్సిన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆనందయ్య మందును ఇతర వ్యాక్సిన్స్ తో పోలుస్తూ చేసిన సదరు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X