మల్లు మీనన్‌నే కాదు.. మాపై దయచూడండి గురూజీ.. ప్రముఖ దర్శకుడికి ఆవేదనతో యువ నటి పోస్ట్

తెలుగు సినిమా పరిశ్రమలో తెలుగు అమ్మాయిల ప్రతిభకు ఆదరణ దక్కడం లేదనే మాట వినిపిస్తూనే ఉంటుంది. టాలెంట్ ఉన్న తెలుగు అమ్మాయిలను పరిశ్రమ పట్టించుకోవడం లేదనే విషయం ఆ మధ్య మీటూ సందర్భంగా భారీగానే చర్చకు దారి తీసింది. అయితే తెలుగు అమ్మాయిలను ప్రోత్సహించకుండా ఉత్తరాది, మలయాళం నుంచి హీరోయిన్లను దిగుమతి చేసుకొంటున్నారనే విషయం టాలీవుడ్‌లో అత్యంత వివాదాస్పదంగా మారింది.

తెలుగు సినిమా పరిశ్రమలో అవకాశాలు దక్కని మాధవీ లత, శ్రీరెడ్డి లాంటి తెలుగు అమ్మాయిలు బాహటంగానే మీడియాలో విరుచుకుపడ్డారు. అలాంటి విమర్శలనే తాజాగా రేఖ భోజ్ అనే యువ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ దర్శకుడిని టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రేఖ భోజ్ ఎవరు? ఆమె సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు ఏమిటంటే?

 Rekha Boj Social media post On popular Director Guruji over movie offers

రేఖా భోజ్ కెరీర్ విషయానికి వస్తే.. మాంగల్యం, స్వాతి చినుకు సంధ్య వేళలో, రంగీలా, కలయా తస్మై నమా: అనే చిత్రాల్లో నటించి టాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకొనే పనిలో పడింది.

తనకు అవకాశం కల్పించాలని ప్రముఖ దర్శకుడిని కోరుతూ.. ఫస్ట్ టైమ్ క్రాస్ ఫిట్, వాస్తవంగా చచ్చి బతుకుతున్నా. చాలా కష్టపడుతున్నా గురూజీ.. ఆ మల్లు మీనన్ నే కాకుండా కొంచెం మమ్మల్ని కూడా దయచూడండి అంటూ ప్రముఖ దర్శకుడిని వేడుకొన్నది.

 Rekha Boj Social media post On popular Director Guruji over movie offers

ప్రముఖ దర్శకుడిని గురూజీ అంటూ సంబోధిస్తూ.. తనకు అవకాశం కల్పించాలని వేడుకోవడం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నది. ఈ టాలెంటెడ్ యాక్టర్ రేఖా భోజ్‌ ఆవేదనను గురూజీ అర్ధం చేసుకొని ఆదరిస్తారో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X