నిఖిల్ ముద్ర రిలీజ్ డేట్ ఖరారు!
యంగ్ హీరో నిఖిల్ విభిన్న చిత్రాలతో క్రేజ్ తెచ్చుకుంటున్నాడు. నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ముద్ర. తమిళ సూపర్ హిట్ చిత్రం కణిథన్ చిత్రానికి రీమేక్ గా వస్తోంది. నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్నారు. థ్రిల్లింగ్ అంశాలతో రూపొందుతున్న ఈ చిత్రంలో నిఖిల్ జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నాడు.
తాజగా ఈ చిత్ర విడుదుల తేదీ ఖరారు చేసారు. నవంబర్ 8న ముద్ర చిత్రాన్ని విడుదుల చేయనున్నారు. నిఖిల్ చివరి రెండు చిత్రాలు కేశవ, కిరాక్ పార్టీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీనితో ముద్ర చిత్రంపై నిఖిల్ ఆశలు పెట్టుకుని ఉన్నాడు. ఈ చిత్రం విజయం సాధించడం హీరోయిన్ లావణ్య త్రిపాఠికి కూడా అవసరమే.

లావణ్య కూడా ఇటీవల వరుసగా పరాజయాలు చవిస్తూస్తోంది. ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు టీఎస్ సంతోష్ తెరకెక్కిస్తున్నారు. కెరీర్ ఆరంభం నుంచి నిఖిల్ విభిన్న కథలపై దృష్టి పెడుతున్నాడు. అందుకే ఆడియన్స్ లో నిఖిల్ చిత్రాలపై ఆసక్తి నెలకొని ఉంది.


Click it and Unblock the Notifications











