న్యాయం కోసం పోరాడతాను.. మీ అందరి సపోర్ట్ కావాలి: రేణు దేశాయ్ షాకింగ్ డిసిషన్
బద్రి సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైన నటి రేణు దేశాయ్. మోడల్ గా అడుగు పెట్టిన మొదట్లోనే సినిమా అవకాశం అందుకొని మంచి క్రేజ్ అందుకున్న రేణు పెళ్లితో తన కెరీర్ ని త్యాగం చేసింది. ఆ తరువాత వివిధ కారణాల వల్ల ఆమె విడాకులు తీసుకొని తన పిల్లలతోనే హ్యాపీగా జీవితాన్ని గడుపుతోంది. ఇక ఇటీవల రేణు ఒక సరికొత్త నిర్ణయంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

చాలా కాలం తరువాత దర్శకురాలిగా
జానీ సినిమా తరువాత సినిమాలకు దూరంగా ఉన్న రేణు దేశాయ్ మళ్ళీ చాలా కాలం తరువాత దర్శకురాలిగా తన అదృష్టాన్ని పరిక్షించుకుంది. కానీ నటిగా ఆమె ఇంకా బిజీ కాలేదు. రీ ఎంట్రీ పై రోజుకో రూమర్ వస్తున్నా అవన్నీ అబద్దాలని తేలాయి. ఆ మధ్య ఒక సినిమాలో తల్లి పాత్రలో నటించే అవకాశం వచ్చినా కొంత అస్వస్థత వల్ల చేయలేకపోయింది.

దాదాపు 18 ఏళ్ళ తరువాత
ఇక యాక్టింగ్ కెరీర్ పై ఫైనల్ గా రేణు దేశాయ్ ఒక వివరణ ఇచ్చింది. దాదాపు 18 ఏళ్ళ తరువాత తన కొత్త సినిమాపై క్లారిటీ ఇవ్వడంతో మీడియాలో కూడా ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. అతి త్వరలోనే తన కొత్త సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేస్తాను అంటూ ఇన్స్టాగ్రామ్ లో ఒక స్పెషల్ పోస్ట్ కూడా చేసింది.

న్యాయం కోసం పోరాడే ఒక మహిళగా..
ఇక తన లేటెస్ట్ లుక్ కి సంబంధించిన ఫొటో కూడా పోస్ట్ చేసిన రేణు దేశాయ్ ఈ విధంగా వివరణ ఇచ్చింది. చాలా కాలం తరువాత కెమెరా ముందుకు వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఒక మంచి వెబ్ సిరీస్ చేయడానికి ఒప్పుకున్నాను. అక్టోబర్ లో మొదలయ్యే ఈ వెబ్ సిరీస్ లో న్యాయం కోసం పోరాడే ఒక పవర్ఫుల్ మహిళ పాత్రలో నటిస్తున్నాను. తప్పకుండా ఆ పాత్ర మీకు నచ్చుతుంది.

మీ అందరి సపోర్ట్ కావాలి..
మీ అందరి సపోర్ట్ కావాలి. ఈ వెబ్ సిరీస్ ఎప్పుడు మొదలవుతుందా? నేను ఎప్పుడు నటిస్తానా అని చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ఎమ్.ఆర్.కృష్ణ మామీడాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సాయి కృష్ణ ప్రొడక్షన్ బ్యానర్ లో డీఎస్.రావ్, ఎస్.రజినీకాంత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు అని రేణు దేశాయ్ సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చింది. అదే విధంగా సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తానని కూడా ఆమె తెలియజేశారు.
View this post on InstagramA post shared by renu desai (@renuudesai) on


Click it and Unblock the Notifications











