మహేష్ బాబుతో సినిమా.. వరుసగా ఫోన్ కాల్స్.. క్లారిటీ ఇచ్చిన రేణూ దేశాయ్!
పవర్ స్టార్ మాజీ సతీమణి రేణూ దేశాయ్ మారోసారి వార్తల్లో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. మంచి అవకాశం వస్తే సినిమాల్లో మళ్ళీ నటిస్తాను అంటూ ఆమె క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆమె అలా క్లారిటీ ఇచ్చినప్పటి నుంచి అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. ఇటీవల మహేష్ బాబు సినిమాలో రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ విషయంపై ఇటీవల ఆమె మరో క్లారిటి ఇచ్చారు.
మహేష్ బాబు నిర్మాతగా మేజర్ అనే ఒక సినిమాను తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తున్న ఆ సినిమాలో రేణూ దేశాయ్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుందని గతంలో ఎప్పుడు లేని విధంగా ఆమె సరికొత్త పాత్ర ద్వారా మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ విషయంపై ఆమె ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక క్లారిటీ ఇచ్చారు.

గత కొన్ని రోజులుగా నాకు అనేక రకాల ఫోన్ కాల్స్ వస్తున్నాయి. కంగ్రాట్స్ చెప్పడమే కాకుండా విషెస్ చెబుతున్నారు. నిజంగా అది మంచి విషయమే అయినప్పటికీ నేను ఎలాంటి సినిమాలో నటించడం లేదని రేణూ దేశాయ్ క్లారిటీ ఇచ్చారు. ఇంతవరకు కూడా ఏ సినిమాకు సైన్ చేయలేదని కూడా వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











