Just In
- 3 hrs ago
శివరాత్రికి ‘శ్రీకారం’.. శర్వానంద్ సందడి అప్పుడే!
- 3 hrs ago
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- 4 hrs ago
HBD Namrata.. ఐదేళ్లలో 29 హెల్త్ క్యాంప్స్.. అందుకే మహేష్ బాబుకు ఇంతటి క్రేజ్!
- 5 hrs ago
‘ఖిలాడీ’ అప్డేట్.. రవితేజ మరీ ఇంత ఫాస్ట్‌గా ఉన్నాడేంటి!
Don't Miss!
- News
43 లక్షల మంది ఇళ్లకు బీజేపీ కార్యకర్తలు.. హస్తిన పురవీధుల్లో.. ఎందుకంటే
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Automobiles
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సర్కారు వారి పాటలో వదిన పాత్ర.. ఫైనల్ గా క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్
ఒక పెద్ద సినిమా ఎనౌన్స్మెంట్ రాక ముందే వార్తలు ఏ రేంజ్ లో వైరల్ అవుతాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక అఫీషియల్ ప్రకటన వచ్చిన తరువాత మరో స్థాయిలో గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి. ఇటీవల కాలంలో మహేష్ బాబు కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన వార్తలు అయితే చాలానే వైరల్ అయ్యాయి. ముఖ్యంగా సర్కారు వారి పాటలో పాత్రలపై కూడా ఊహాగానాలు గ్యాప్ లేకుండా కన్ఫ్యూజన్ ను క్రియేట్ చేస్తున్నాయి.

రూమర్స్ ఎన్ని వచ్చినా కూడా స్పందించలేదు
గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమా బ్యాంకింగ్ మోసాలకు సంబంధించిన పాయింట్ తోనే తెరకెక్కుతున్నట్లు మొదట్లోనే రూమర్స్ వచ్చాయి. దర్శకుడు పరశురామ్ తన మార్క్ ఫ్యామిలీ సీన్స్ ను కూడా చూపించనున్నట్లు తెలుస్తోంది. ఇక రూమర్స్ ఎన్ని వచ్చినా కూడా చిత్ర యూనిట్ పెద్దగా రెస్పాండ్ అవ్వడం లేదు.

మహేష్ బాబు వదిన పాత్రలో..
ఇక సినిమాలో మహేష్ బాబుకు వదినగా రేణు దేశాయ్ నటిస్తున్నట్లు గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో మహేష్ ఫ్యాన్స్ కొంత వరకు నిజమని అనుకున్నారు. నిజంగా ఈ కాంబినేషన్ పర్ఫెక్ట్ అనే కామెంట్స్ కూడా వచ్చాయి.

క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్
ఇక ఫైనల్ గా సినిమాకు సంబంధించిన రూమర్స్ పై రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ.. ఎక్కడి నుంచి ఈ రూమర్స్ స్టార్ట్ చేస్తున్నారో తెలియదు కాని చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. లాస్ట్ టైమ్ కూడా ఇలాంటి రూమర్ ఒకటి వైరల్ అయ్యింది. మేజర్ సినిమాలో నేను ఒక పాత్రలో నటిస్తున్నట్లు రూమర్స్ స్ప్రెడ్ చేశారుని తెలిపారు.

నేను చెప్పేవరకు ఎవరు నమ్మవద్దు..
నిజంగా సర్కారు వారి పాటలో నేను ఎలాంటి పాత్రలో నటించడం లేదని క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్ ఏదైనా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ నుంచే వస్తుంది. అందుకే వెబ్ మీడియాలో వస్తున్న ఎలాంటి రూమర్స్ ను నమ్మవద్దని రేణు దేశాయ్ వివరణ ఇచ్చారు. దీంతో ఫైనల్ గా ఈ రూమర్స్ కు ఎండ్ కార్డ్ పడింది.