ఆయన గురించి చెప్పడానికి మాటలు సరిపోవడం లేదు.. రేణూ దేశాయ్ పోస్ట్ వైరల్
రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్ భార్యగా ఎంత ఫేమస్ అయిందో.. విడాకుల అనంతరం మాజీ భార్య అనే ట్యాగ్‌తో మరింత ఫేమస్ అయింది. పవన్ కళ్యాణ్ రేణూ దేశాయ్ విడిపోవడం, పవన్‌పై రేణూ దేశాయ్ కామెంట్స్ చేయడం, ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో చెప్పడం, రెండో పెళ్లికి రేణు సిద్దపడటం అప్పట్లో ఓ సెన్సేషన్. అయితే రేణూ దేశాయ్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి తన పనిలో తాను నిమగ్నమైంది. నిత్యం ఏదో ఒక పోస్ట్ పెడుతూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.

వారి గురించే..
ఆద్య, అకీరా నందన్ గురించి నిత్యం ఏదో ఒక అప్ డేట్ ఇస్తూనే ఉంటుంది. ఆమె చేసే పోస్ట్‌లో ఎక్కువ శాతం ఆద్య గురించే ఉంటుంది. లేదా ఆద్య తీసిన ఫోటోలే అయి ఉంటాయి. ఎక్కడి వెళ్లినా సరే అక్కడి లొకేషన్ల బంధిస్తూ సోషల్ మీడియాలో పంచుకుంటుంది. తాజాగా రేణూ దేశాయ్ షూటింగ్‌లో ఫుల్ బిజీ అయింది.

పెళ్లి అంటూ వార్తలు..
లాక్ డౌన్ తరువాత చాలా గ్యాప్ తీసుకున్న రేణూ కెమెరా ముందుకు వచ్చింది. జీ ఛానెల్, యాప్‌లో ప్రారంభం కానున్న ఓ కార్యక్రమంలో రేణూ దేశాయ్ నటిస్తోంది. ఈ మేరకు షూటింగ్ కూడా చకచకా పూర్తి చేసేస్తున్నారు. ఆ సమయంలోనే ఆమె మెడలో ఉన్న నల్ల పూసలను చూసి పెళ్లి అయినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే షూటింగ్ కోసం ధరించిందని తరువాత తెలిసింది. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫోటో, చేసిన కామెంట్ అందర్నీ ఆకట్టుకుంది.

సద్గురు, ఈషా ఫౌండే
సినీ సెలెబ్రిటీలకు సద్గురు, ఈషా ఫౌండేషన్ గురించి బాగానే తెలిసి ఉంటుంది. మన హీరోలు, హీరోయిన్లు సద్గురుతో ఇంటర్వ్యూలు కూడా చేస్తుంటారు. అంతే కాకుండా మన తారలంతా ఈషా ఫౌండేషన్‌ను, అక్కడి ఆధ్యాత్మికతను ఫాలో అవుతుంటారు. తాజాగా రేణూ దేశాయ్ సద్గురును, ఈషా ఫౌండేషన్‌ను ఉద్దేశించి ఓ పోస్ట్ చేసింది.
Recommended Video

ఆయన చేస్తున్న పనులు..
‘సద్గురు.. ఆయన గురించిచెప్పడానికి మాటలు చాలవు. ఆయన ఇక్కడ ఉన్నందుకు కేవలం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మోడ్రన్ కల్చర్‌ను, భారతీయ సంస్కృతికి వారధిగా ఆయన చేస్తున్నదానికి ఎప్పుడో ఒకప్పుడు వ్యక్తిగతంగా కలిసి ఆయనకు ధన్యవాదాలు చెప్పుకోవాలని కోరుకుంటున్నాను' అని ఆద్య ఫోటోను షేర్ చేసింది. అంతేకాకుండా సద్గురుకు సంబంధించిన ఓ పుస్తకాన్ని షేర్ చేసింది.


Click it and Unblock the Notifications











