నెపోటీజంపై క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్.. అకిరా నందన్ ఎంట్రీ ఉంటుందని..
సినిమా ఇండస్ట్రీలో నెపోటీజమ్ అనేది ఏ రేంజ్ లో ఉంటుందో ఇప్పుడిపుడే పూర్తిగా అర్థమవుతోందని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. సుశాంత్ మరణం ముందు నుంచి కూడా నెపోటీజమ్ అనే పదం అంతగా వైరల్ కాలేదు. కానీ ఎప్పుడైతే అతను సూసైడ్ చేసుకున్నాడో బాలీవుడ్ లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా ఆ పదం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల రేణు దేశాయ్ కూడా నెపోటీజమ్ పై తనదైన శైలిలో వివరణ ఇచ్చింది.
Recommended Video

కేవలం బాలీవుడ్ కొనే కాదు..
కేవలం బాలీవుడ్ లోనే కాకుండా మిగతా సినిమా ఇండస్ట్రీలో కూడా సినీ వారసులకు ఎక్కువగా అవకాశాలు అందుతున్న విషయం తెలిసిందే. అయితే ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా వారి సొంత టాలెంట్ తోనే ఎక్కడైనా నిలదొక్కుకోవాల్సి ఉంటుంది. ఇటీవల పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణు దేశాయ్ కూడా నెపోటీజమ్ గురించి అదే తరహాలో వివరణ ఇచ్చారు.

క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్..
భవిష్యత్తులో అకిరా నందన్ కూడా పవర్ స్టార్ బ్రాండ్ తో సినిమాల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది గనక ఆమె ఈ విదంగా స్పందించినట్లు తెలుస్తోంది. రేణు దేశాయ్ మాట్లాడుతూ.. నెపోటీజమ్ అనేది ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే కాదు. ఎక్కడైనా ఉంటుంది. కానీ ఫైనల్ గా ఎవరైనా సరే టాలెంట్ తో ధైర్యంగా ఉంటేనే ఆ పరిస్థితులను జయించగలరని తెలిపింది.

సుశాంత్ సూసైడ్..
సుశాంత్ సూసైడ్ గురించి మాట్లాడుతూ.. అతనిది చాలా సున్నితమైన మనస్తత్వం అని అర్ధమవుతోంది. ఇక సుశాంత్ కి టాలెంట్ ఉంది కాబట్టే.. ఇన్నాళ్లు ఇండస్ట్రీలో మంచి విజయాల్ని అందుకున్నాడు. తనకున్న స్థాయి కూడా పెరిగింది. అయితే సుశాంత్ కొన్ని ఎమోషన్స్ ని అతడు బ్యాలెన్స్ చేసుకోలేకపోయాడని తెలుస్తోంది.

అది చాలా అవసరం..
మనోధైర్యంతో ఉండాల్సిన అతను తీవ్ర భావోద్వేగానికి లోనవ్వడం కారణంగానే డిప్రెషన్ కి గురయ్యాడు. అందుకే అలాంటి కఠిన నిర్ణయం తీలుకోవాల్సి వచ్చింది. ఇక సినిమాల్లోకి వచ్చే ఎవరైనా సరే.. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ని నమ్ముకొని రవద్దు. ఒక మంచి యాక్టర్ గా కొనసాగలి అంటే.. మనోధైర్యం కూడా చాలా అవసరం.. అంటూ రేణు దేశాయ్ వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











