twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిత్యావసరాలు కావాలా, కామెంట్ చేయండి.. సాయం చేయడానికి ముందుకొచ్చిన రేణుదేశాయ్!

    |

    ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో ఎవరూ ఇంటి నుంచి అడుగు బయట పెట్టలేని పరిస్థితి నెలకొంది. సినిమా రంగం కూడా ఇప్పటికే దాదాపు మూతపడి పోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడిపుడే కాస్త కుదుట పడుతున్నా ఎక్కడా షూటింగులు జరగడం లేదు. అయితే నిన్న మొన్నటి దాకా హీరోలు, నిర్మాణ సంస్థలు మరికొందరు నటీమణులు సైతం కరోనా మందులు అలాగే ఆక్సిజన్ బెడ్స్ సంబంధించిన రిక్వెస్ట్ లు ఫార్వర్డ్ చేస్తూ తమ వంతు సాయం చేశారు. ఇప్పుడు లాక్ డౌన్ వలన ఇళ్ళకే పరిమితం అయి ఇబ్బందులు పడుతున్న వారికి నిత్యావసరాలు అందిస్తున్నారు.

    అదే క్రమంలో పవన్ మాజీ భార్య, ప్రస్తుతం పలు టెలివిజన్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్న రేణుదేశాయ్ కూడా తన వంతుగా సహాయం అందిస్తున్నారు. తాజాగా ఏపీ మరియు తెలంగాణ అంతటా ఆహారం గాని కిరాణా వస్తువులు గాని ఏవైనా కావాలి అనుకుంటే దయచేసి మీ ఊరు పేరుతో కింద కామెంట్ చేయండి అంటూ ఆమె తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టారు. అయితే ఫోన్ నెంబర్స్ ఏమీ కామెంట్ చేయవద్దని కేవలం ఊరి పేరు మాత్రమే అక్కడ మెన్షన్ చేయమని ఆమె కామెంట్ చేశారు.

    renu desai asks to comment for grocery help in instagram

    దీంతో ఇప్పటికి దాదాపు చాలా మంది ఆమె సహాయం కోసం కామెంట్స్ చేస్తున్నారు. ఇక మీకు చుట్టుపక్కల ఎవరైనా ఇలాంటి సహాయం కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నా కామెంట్ చేయవచ్చు. ఇక గతంలో ఆమె తనకు చేతనయినంత సాయం చేస్తూ వెళ్తుంటే ఆమెకు పదే పదే కొందరరి నుంచి తప్పుడు మెసేజ్ లు వెళ్తున్నాయని కూడా ఆమె బాధ పడ్డారు. కొందరు ఫండ్ రైజర్ లింక్స్ షేర్ చేస్తున్నారని కానీ వాటిని వెరిఫై చేసేందుకు తన దగ్గర ఎలాంటి టీం లేదు కాబట్టి తాను ఆ విషయాల్లో కూడా ఏమీ చేయలేని అని గతంలో చెప్పుకొచ్చింది.

    English summary
    Renu Desai is currently helping the needy on social media during the COVID-19 crisis. recently she shared ''Anyone who need food or groceries across Andhra Pradesh and Telangana please comment below with your city''
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X