Renu Desai: పవన్ కల్యాణ్‌కు అంత ప్రేమ లేదు.. చాలా హర్ట్ అయ్యాను.. అర్థం చేసుకోండి!

రేణు దేశాయ్.. ఈ పేరు తెలియని తెలుగు ప్రజలు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య అయిన ఈమెను ఇప్పటికీ అంతా వదినా అనే పిలుస్తున్నారు. తన అభిమాన హీరో భార్యగానే భావిస్తూ.. సపోర్ట్ చేస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుండడంతో.. అంతా ఆమెకు అండగా నిలుస్తూ కామెంట్లు చేస్తుంటారు. అయితే ఇటీవలే ఈ ముద్దుగుమ్మ సాయం చేయాలంటూ కోరింది. 3500 రూపాయలు పంపించాలంటూ ఓ వీడియో చేసింది.

అది చూసిన చాలా మంది ఆమెకు డబ్బులు పంపించారు. దీని తర్వాత ఆమె మరో వీడియోను వదిలింది. ఆ డబ్బు తనకు ఎందుకు కావాల్సి వచ్చింది. వాటితో తాను ఏం చేసిందో చెప్పుకొచ్చింది. అయితే ఆమె మంచి మనసు అర్థం చేసుకున్న చాలా మంది పాజిటివ్ గా కామెంట్లు పెట్టారు. అలా చాలా పాజిటివ్ గా కామెంట్ పెట్టిన ఓ నెటిజెన్ పై మాత్రం రేణు దేశాయ్ చాలా ఫైర్ అయింది. డీప్ గా హర్ట్ అయినట్లు వివరించింది. పవన్ కు అంత ప్రేమ లేదంటూ చెప్పుకొచ్చింది. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Renu Desai Fires on Pawan Kalyan Fan About His Comments Check Details

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రేణు దేశాయ్.. తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అలాగే తన పిల్లల గురించి కూడా చాలానే చెబుతుంటుంది. అంతే కాకుండా తాను చేసే అనేక సేవా కార్యక్రమాల గురించి కూడా సమయం వచ్చినప్పుడల్లా చెబుతూ వస్తున్నారు. తానలా చెబితే మిగతా వారు కూడా సాయం చేస్తారనే ఉద్దేశంతోనే తానలా చెబుతున్నట్లు కూడా పలుసార్లు వివరించిందీ బ్యూటీ.

అయితే ఇటీవలే రేణు దేశాయ్ 3500 కావాలంటూ వీడియో పెట్టగా కొందరు పంపారు. మరికొందరేమో ఆమె అకౌంట్ హ్యాక్ చేశారని, మరికొందరేమో ఆమాత్రం కూడా ఆమె వద్ద లేవా అంటూ కామెంట్లు చేశారు. అయితే వీటన్నిటిపై స్పందిస్తూ.. ఆమె డబ్బులు ఎందుకు అడిగిందో చెప్పింది. తాను ఆ డబ్బులతో జంతువుల కోసం ఓ షెడ్ నిర్మిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఇది చూసిన ప్రతీ ఒక్కరూ ఆమెపై ప్రశంసల వర్షం కురిస్తున్నారు. చాలా మంచి పని చేస్తున్నారు, మంచి మనసుంద మీకంటూ వివరిస్తున్నారు. అయితే ఓ నెటిజెన్ మాత్రం.. మా పవన్ కల్యాణ్ అన్నయ్యలా గోల్డెన్ హార్ట్ అంటూ చెప్పుకొచ్చాడు.

దీనిపై రేణు దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా తాను పదేళ్ల వయసు నుంచే జంతు సంరక్షణ కోసం తన వంతు సాయం చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. దీంతో తన భర్తకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చింది. పవన్ కల్యాణ్ కు జంతువులపై ప్రేమ, కేర్ లేవని.. దయచేసి తాను చేసే పనుల గురించి పోస్టులు పెడితే.. మాజీ భర్త ప్రస్తావన తీసుకు రావొద్దంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రేణూ దేశాయ్ పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X