ప్యాన్ ఇండియా మూవీలో రేణు దేశాయ్.. టైటిల్ ఏంటో తెలుసా?
కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న రేణు దేశాయ్ ప్రస్తుతం కుటుంబం, వ్యక్తిగత విషయాలకే ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. సినిమాలకు దూరమైనప్పటికీ.. వినోద పరిశ్రమతో తన బంధాన్ని కొనసాగిస్తున్నారు. టెలివిజన్ రంగంలో బుల్లితెరపై పలు రియాలిటీ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. బుల్లితెర మీద రాణిస్తున్న రేణు దేశాయ్ ఇక నుంచి వెండితెరపైన కూడా దృష్టిపెట్టారు. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఆద్య చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పవర్‌ఫుల్ లేడి ఓరియంటెడ్ పాన్ ఇండియా చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు.
డిఎస్‌కె స్క్రీన్, సాయికృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై రావ్ డిఎస్, రజనీకాంత్ ఎస్ సంయుక్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రంలో నటించేందుకు రేణు దేశాయ్ అంగీకరించారు. ఈ చిత్రానికి ఎం ఆర్ కృష్ణ మామిడాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
కబాలి చిత్రంలో నటించిన సాయి ధన్సిక, నందిని రాయ్, తదితరులు ముఖ్యపాత్రల్లో నటించనున్నారు. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరో వైభవ్ తత్వవాడి ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారని చిత్ర యూనిట్ వెల్లడించింది.

హుషారు ఫేమ్ తేజ కురపాటి, గీతిక రతన్ యువ జంటగా నటించే ఆద్య విజయదశమి రోజు ఆరంభం కానుంది. రేణు దేశాయ్ రీ ఎంట్రీ ఇస్తున్న ఈ చిత్రం జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని నిర్మాత రజనీకాంత్ తెలిపారు.
ఛాయాగ్రహణం: శివేంద్ర దాశరధి,
కథ-మాటలు: ఆదిత్య భార్గవ్,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృష్ణ చైతన్యరెడ్డి ఎస్,
ప్రొడ్యూసర్స్: రావ్ డి.ఎస్, రజనీకాంత్ ఎస్,
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఎం.ఆర్.కృష్ణ మామిడాల


Click it and Unblock the Notifications











