twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పుట్టిన క్షణం నుంచీ అది అలవాటే..ప్రస్తుతం నాకు నవ్వొస్తుంది..కరోనాపై రేణూ దేశాయ్ సెటైరికల్ కామెంట్స్

    |

    ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ ధాటికి ప్రతీ ఒక్కరూ గజగజ వణికిపోతున్నారు. కరోనా వైరస్‌ను కట్టడి చేద్దామని ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా అది మాత్రం ఆగకుండా విస్తరిస్తూనే ఉంది. రోజు రోజుకు కరోనా బారినపడ్డ వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇండియాలో ఇప్పటికే దాదాపు 170మందికి ఈ కరోనా సోకగా.. ముగ్గురు మృతి చెందారు. కరోనాపై ప్రభుత్వం, సెలెబ్రిటీలంతా కలిసి అవగాహన కలిగిస్తున్నారు. నేడు చిరంజీవి, సంజయ్ దత్, రేణూ దేశాయ్ వంటి సెలెబ్రిటీలు స్పందించారు.

    చిరు సందేశం..

    చిరు సందేశం..

    కరోనాపై స్పందించిన చిరంజీవి.. తుమ్మినప్పుడు గానీ, దగ్గినప్పుడు గానీ రుమాల్ అడ్డు పెట్టుకోవాలని, మోచేతి వరకు కనీసం ఇరవై సెకండ్ల వరకు శుభ్రంగా కడుక్కోవాలని సలహా ఇచ్చాడు. ప్రయాణాలు చేయొద్దని, అందరూ కలిసి ఒకే చోట గుమిగూడకండని సూచించాడు. ఎవరైనా కలిస్తే షేక్ హ్యాండ్స్ కాకుండా మన సంప్రదాయం ప్రకారం..చేతులు జోడించి నమస్కరించండి.. అదే ఉత్తమమైన పని అంటూ అభిమానులకు సందేశాన్ని ఇచ్చాడు.

    సంజయ్ దత్ సైతం..

    సంజయ్ దత్ సైతం..

    దేశమంతటా విజృంభిస్తున్న కరోనాపై బాలీవుడ్ హీరో సంజయ్ దత్ స్పందిస్తూ.. ‘ఇలాంటి సమయంలో సమాజానికి దూరంగా ఉండాల్సిన ఆవశ్యకతను, ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. దయచేసి మీ గురించి, మీకు సంబంధించిన వారి గురించి జాగ్రత్త వహించండి. సరైన జాగ్రత్తలు తీసుకుంటే మనంరం కలిసి త్వరలో దీనిని అధిగమిస్తాము. ఇంట్లోనే ఉండండి.. సురక్షితంగా ఉండండ'ని ట్వీట్ చేశాడు.

    సోషల్ మీడియాలో యాక్టివ్

    సోషల్ మీడియాలో యాక్టివ్

    రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎంతలా యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కవిత్వాలు రాస్తూ నిత్యం ఏదో ఒక సామాజిక సమస్యపై స్పందిస్తూ ఉంటుంది. తాజాగా ఓ చిత్రానికి దర్శకత్వం వహించే పనిలో భాగంగా ప్రీ ప్రొడక్షన్ పనులంటూ బిజీగా తిరుగుతోంది.

    Recommended Video

    Anchor Suma Tips To Stay Away From Corona Virus
    పుట్టిన క్షణం నుంచి అలవాటే..

    పుట్టిన క్షణం నుంచి అలవాటే..

    కరోనాపై సెటైరికల్ కామెంట్స్ చేసింది. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు నలుగురిలో తిరగకండి, గుమిగూడకండి సమాజానికి దూరంగా ఉండండని అందరూ సలహా ఇస్తున్న నేపథ్యంలో రేణూ దేశాయ్ ఓపోస్ట్ చేసింది. సమాజానికి దూరంగా ఉండటం అనేది తనకు చిన్నప్పటి నుంచే అలావాటని, అయితే తనకు అంత సులభమైన పనిని ఇలా అందరూ ఎంతో కష్టంగా భావిస్తూ ఉంటే తనకు నవ్వొస్తుందని తెలిపింది. దయచేసి వీలైనంతవరకు ఇంట్లో ఉండి, కోవిడ్ -19 వైరస్ వ్యాప్తిని అరికట్టండి.. వైద్య నిపుణుల మాట వినండి. సురక్షితంగా మరియు ఆరోగ్యంగా ఉండండని తెలిపింది.

    English summary
    Renu Desai Interesting Post About Coronavirus. Social distancing is an art that I have mastered since my birth and now I smile when I see everyone struggling to do something that comes effortlessly to me Guys, please stay at home as much as possible and stop the spread of Covid-19 virus and listen to the medical professionals. Take care. Be safe and healthy
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X