పవన్ కళ్యాణ్ నిజ స్వరూపం అదే.. ఆ విషయం బయటపెట్టిన రేణు దేశాయ్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. జనసేన పార్టీ ప్రారంభించి గతేడాది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి 70వేలకు పైగా ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. మరోవైపు తన పార్టీతో ఇండియాలోనే వంద శాతం సీట్లు గెలుపొందిన పార్టీగా రికార్డులోకి ఎక్కించారు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రజా సేవ చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు దేశ రాజకీయాలపైనా ఆయన ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. అటు వైపుగా ఆయన వంతు కృష్టి చేస్తూనే ఉన్నారు. మరోవైపు తను ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడాని కంటే ముందే సైన్ చేసిన పలు చిత్రాలను కూడా పూర్తి చేసే పనిలో ఉన్నారు.
ఇదిలా ఉంటే.. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ప్రస్తుతం పవర్ స్టార్ నుంచి విడిపోయి సెపరేట్ గా జీవనం సాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గురించి రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూనే వస్తోంది. ఆయన గొప్పతనం గురించి పలు ఇంటర్వ్యూలో ఇప్పటికే బొలెడన్నీ విషయాలు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ నిజస్వరూపం ఎలాంటిదో చెప్పే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రేణు దేశాయ్ మాట్లాడుతూ.. జానీ సినిమా సమయంలో పవన్ కళ్యాణ్ పెద్దగా కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయారు. ఆ చిత్రం కోసం ఆయనెంతో కష్టపడ్డారు కానీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేకపోయింది. అయితే.. ఆ మూవీకి ప్రొడ్యూస్ చేసిన నిర్మాతలు పవన్ కళ్యాణ్ కు రెమ్యునరేషన్ మాత్రం ఇచ్చారని చెప్పింది. ఆ సమయంలోనే కోట్ల విలువైన చెక్కును అందించారంట పవన్ కళ్యాణ్. కానీ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోవడంతో ఆ చిత్రానికి తన రెమ్యునరేషన్ ను పవన్ కళ్యాణ్ తిరిగి ఇచ్చేరంట. అలాగే చాలా సినిమాలకు రిజల్ట్ ఆశించిన మేర లేకపోతే పవన్ కళ్యాణ్ తన పారితోషికాన్ని తిరిగి ఇచ్చేస్తుంటారని చెప్పింది.
అయితే.. పవన్ కళ్యాణ్ కుడి చేతితో చేసిన సాయం.. ఎడమ చేతికి కూడా తెలియనివ్వరు. నిర్మాతలే కాకుండా.. చాలా మంది సినీ తారలకు, ఆర్టిస్టులకు పవన్ తనకు వీలైనంత వరకు సాయం చేస్తూనే ఉంటారని ప్రముఖులు కూడా ఆయా సందర్భాల్లో చెప్పారు. ముఖ్యంగా తనను నమ్మిన నిర్మాతలను మాత్రం ఏమాత్రం కష్టపడకుండా చూసుకుంటారని రేణు దేశాయ్ చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఇక జానీ సినిమా 2003లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పవన్ కళ్యాణ్ డైరెక్ట్ చేశారు. అల్లు అరవింద్ నిర్మాత. న్యూ యాక్షన్ కొరియోగ్రఫీతో జానీ సినిమాను స్టైలిష్ గా తెరకెక్కించారు పవన్. ఇప్పుడు ఆ చిత్రానికి ఎంతో ఆదరణ దక్కింది.

ఇక రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ 2001 నుంచి రిలేషన్ షిప్ లో ఉన్నారు. 2009లో పెళ్లి చేసుకొని అకీరా నందన్, కూతురు ఆద్యకు జన్మనిచ్చారు. 2012లో పర్సనల్ రీజన్స్ వల్ల విడిపోయారు. కానీ ఇప్పటికీ తమ మధ్య ఫ్రెండ్లీ రిలేషన్ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అన్నా లెజినెవాతో కాపురం చేస్తున్న సంగతి తెలిసిందే. వీరి ఇద్దరికి ఒక కూతురు, కొడుకు ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ నుంచి 'హరిహర వీరమల్లు', 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాలు రిలీజ్ కావాల్సి ఉన్నాయి.


Click it and Unblock the Notifications











