ఆద్య ఆయనలానే ఉంటుంది.. పవన్ కళ్యాణ్ ఫోటో షేర్ చేసిన రేణు దేశాయ్
బద్రి, జానీ సినిమాల్లో కలిసి నటించిన పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ నిజజీవితంలోనూ ఒక్కటయ్యారు. అయితే కొన్ని కారణాల వల్ల వారిద్దరు విడిపోయారు. ఇష్టపూర్వకంగా చట్టబద్దంగా విడిపోయినా.. పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఇప్పటికీ రేణు దేశాయ్‌ను అలానే గుర్తిస్తూ ఉంటారు. రేణు దేశాయ్-పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ విషయం సోషల్ మీడియాలో అప్పట్లో ఎంతటి సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే.

రెండో పెళ్లిపై హింట్..
పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన అనంతరం రేణు దేశాయ్ కొంతకాలం ఒంటరిగానే ఉంది. అకీరా నందన్, ఆద్యలతో పుణెలో ఉన్న రేణు దేశాయ్‌కు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం వదల్లేదు. వదినా అంటూ సంబోధించడం, పవర్ స్టార్ భార్య అని అనడంతో ఆమె అసహనాని గురికావడం అందరికీ తెలిసిందే. ఆమె రెండో పెళ్లికి సిద్దం కావడం, వరుడి వివరాలను రహస్యంగా ఉంచడం అప్పట్లో సంచలనంగా మారింది.

నిశ్చితార్థం కూడా..
అయితే రేణు దేశాయ్ రెండో పెళ్లిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరగడం, పవన్ ఫ్యాన్స్ నుంచి బెదిరింపులు వెళ్లడం పెను సంచలనంగా మారింది. దీంతో వరుడి వివరాలను మాత్రం రేణు దేశాయ్ ఎక్కడా వెల్లడించలేదు. అయితే నిశ్చితార్థం అయినట్టు ఓ ఫోటోను మాత్రం షేర్ చేసింది. పెళ్లి విషయంలో తాత్సారం చేస్తున్నట్లు కనిపిస్తోంది.
ఫ్యాన్స్ వార్..
ప్రతీసారి రేణు దేశాయ్ ఏదో ఒక పోస్ట్ పెట్టడం, దానికి పవన్ ఫ్యాన్స్ కామెంట్లు పెట్టడంతో వార్ మొదలవుతోంది. నెటిజన్ల కామెంట్లకు ఫీల్ అయిన రేణు దేశాయ్ తనదైన స్టైల్లో రిప్లై ఇవ్వడం జరుగుతూనే వస్తోంది. అయినా వీటన్నంటిని తట్టుకుని తనపని తాను చేసుకుంటూ, సినిమాలు, షోలు చేసుకుంటూ వస్తోంది.

తాజా పోస్ట్ వైరల్..
తాజాగా తండ్రీ కూతుళ్ల ప్రేమకు సంబంధించిన ఓ పోస్ట్ చేసింది. ఆద్య అప్పుడప్పుడు తనలానే అనిపిస్తుంది కానీ చాలా సమయాల్లో వాళ్ల నానమ్మ, నాన్నలానే అనిపిస్తుంది అంటూ ఓ పోస్ట్ చేసింది. దీంతో పాటు పవన్ కళ్యాణ్, ఆద్యలు అనుబంధంగా దిగిన ఫోటోను షేర్ చేసింది.


Click it and Unblock the Notifications











