twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్పెషల్ ఫోటో: పవన్ కళ్యాణ్ ఎదురుగా రేణూ దేశాయ్.. చాలా ఇబ్బంది పడ్డారట!

    |

    సినిమా నటిగానే కాకుండా దర్శకురాలిగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రేణూ దేశాయ్ చాలా కాలం తరువాత ఒక స్పెషల్ ఫోటో పోస్ట్ చేశారు. సాధారణంగా పవన్ కి సంబంధించిన విషయాలపై రేణూ చాలా పాజిటివ్ గా స్పందిస్తూ ఉంటుంది. విడాకులు తీసుకున్నా కూడా మంచి స్నేహంతో పిల్లలకు మంచి తల్లిదండ్రులుగా ఉంటున్నట్లు రేణూ దేశాయ్ చాలా సార్లు చెప్పారు.

     సోషల్ మీడియాలో అప్డేట్స్..

    సోషల్ మీడియాలో అప్డేట్స్..

    సోషల్ మీడియాలో రేణూ దేశాయ్ చురుగ్గా కనిపిస్తుంటారు. ఏ విషయమైనా సరే తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్ కి క్లారిటీ ఇస్తుంటారు. తన పిల్లలు అకిరా, ఆద్యకి సంబంధించిన ఫొటోలే కాకుండా సామాజిక అంశాలపై కూడా రేణూ దేశాయ్ వివిధ రకాల కవితలు షేర్ చేస్తుంటారు.

     స్పెషల్ ఫోటో..

    స్పెషల్ ఫోటో..

    చాలా కాలం తరువాత రేణూ దేశాయ్ ఇన్స్టాగ్రామ్ లో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక ఫోటో కనిపించింది. వారిద్దరు బద్రి సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ ఫోటోని షేర్ చేశారు. అందులో పవన్ కళ్యాణ్ ఒక పెద్ద బడరాయిపై పడుకొని ఉండగా రేణూ దేశాయ్ ఎదురుగా నిలబడి ఉంది.

    చాలా ఇబ్బందిపడ్డారట..

    చాలా ఇబ్బందిపడ్డారట..

    బద్రి సినిమా విడుదలై నేటికి 20ఏళ్ళు పూర్తి కావడంతో ఆ సినిమా షూటింగ్ సమయంలో పవన్ తో ఉన్న ఒక ఫోటోని రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటో వెనక ఉన్న కథ గురించి మాట్లాడుతూ.. విదేశాల్లో సిటీకి దూరంగా జరిపిన షూటింగ్ లో ఒకసారి చాలా ఇబ్బందిపడాల్సి వచ్చింది. అది ఒక రిమోట్ ఏరియా.. కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవు. నేను షార్ట్ స్కర్ట్ వేసుకోవడం వలన కింద కూర్చోవడానికి రాలేదని రేణూ దేశాయ్ వివరణ ఇచ్చారు.

    Recommended Video

    Pawan Kalyan Didn't Use Even Caravan while Movie Shootings
     పవన్ కళ్యాణ్ సింపుల్ గా..

    పవన్ కళ్యాణ్ సింపుల్ గా..

    రేణూ దేశాయ్ పవన్ కళ్యాణ్ ముందు నిలబడి ఉండగా పవన్ మాత్రం ఇబ్బంది లేకుండా పక్కనే ఉన్న బండపై కాసేపు సేద తీరారట. బద్రి సినిమా బంగాళఖాతంలో సాంగ్ చిత్రీకరణ సమయంలో ఈ ఫోటో తీసారట. బద్రి సినిమా 2000 సంవత్సరంలో ఏప్రిల్ 20న రిలీజయ్యింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

    English summary
    After a long time Renu Desai posted a photo of Pawan Kalyan on Instagram. It is known that both of them acted in Badri. However, a special photo of the film was shared. Pawan Kalyan is sitting on a big rock and Renu is standing in front of pawan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X