రెండో పెళ్లిపై రేణుదేశాయ్ సంచలనం.. పిల్లల కోసమే అంటూ!
నార్త్ సినిమాలోనే కాకుండా సౌత్ సినిమా దగ్గర కూడా సినీ తారలు నడుమ ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న జంటలు చాలానే కనిపిస్తాయి. కాగా ఈ జంటల్లో ఇపుడు వరకు కలిసి ఉన్నవారు కూడా ఉన్నారు. అలాగే విడిపోయినవారు కూడా ఉన్నారు. ఇక విడిపోయి రెండో పెళ్లి చేసుకున్న నటీనటులు కూడా అనేకం. అయితే ఈ విడిపోయాక రెండో పెళ్లి అనే కాన్సెప్ట్ ఎక్కువగా హీరోల కంటే హీరోయిన్స్ కి బాగా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పవచ్చు.
కాగా టాలీవుడ్ ప్రెజెంట్ యువతలో ఎంతో ఇష్టమైన జంట అక్కినేని నాగ చైతన్య అలాగే సమంతల జంట అని చెప్పవచ్చు. వీరి విడాకులు తర్వాత నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకున్నాడు కానీ సమంత మాత్రం ఇప్పటికీ సింగిల్ గానే ఉండిపోయింది. కాగా వీరికంటే ముందు మరో స్టార్ జంట అది కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న వారే అయినటువంటి పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ల జంట కోసం తెలుగు ఆడియెన్స్ కి చెప్పాల్సిన పని లేదు.

అయితే వీరి వైవాహిక జీవితం అలాగే విడిపోయిన తర్వాత కూడా అంత సజావుగా సాగలేదు. మెయిన్ గా విడాకులు తర్వాత మాత్రం రేణు దేశాయ్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పవన్ మూడో పెళ్లి చేసుకొని రాజకీయాల్లో బిజీగా మారిపోయారు. కానీ రేణు దేశాయ్ అక్కడ నుంచి మళ్ళీ పవన్ తో ఇంటరాక్ట్ అవ్వడం జరగలేదు. కేవలం పిల్లలు వరకు మాత్రం పవన్ తో కనిపించేవారు.
ఈ నేపథ్యంలో రేణు దేశాయ్ తాను రెండో పెళ్లి చేసుకోవడంపై చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. కాగా రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకుందాం అనే ఆలోచన ఉన్నట్టుగా రివీల్ చేశారు. నిజానికి తనకి రెండో పెళ్లి చేసుకోవాలని చాలా సార్లు అనిపించిందట. కొన్నేళ్లు వెనక్కి వెళితే తన సోషల్ మీడియాలో రేణు దేశాయ్ పలు సందర్భాల్లో ఒక వ్యక్తిని పలు పోస్ట్స్ లో పెట్టి హింట్స్ కూడా ఇవ్వడం జరిగింది.
అంతే కాకుండా రెండో పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమైనట్టు చెప్పిన మాటలు మాత్రం ఆమెని ప్రశాంతంగా ఉండనివ్వలేదు. మెయిన్ గా పవన్ అభిమానులు నుంచే నెగిటివ్ కామెంట్స్ చాలా ఎక్కువ వినిపించిన నేపథ్యంలో రేణు దేశాయ్ పవన్ అభిమానులు మీద ఫైర్ కూడా అయ్యారు. దీనితో అక్కడ నుంచి మళ్ళీ తన రెండో పెళ్లిపై రేణు దేశాయ్ మాట్లాడలేదు కానీ ఇపుడు ఇచ్చిన డీటెయిల్స్ షాకింగ్ గా మారాయి.
తనకి పెళ్లి చేసుకోవాలి అనిపించిన మాట వాస్తవం అని ఒప్పుకున్నారు కానీ తనకు ఉన్న ఇద్దరు పిల్లల భాద్యత మూలాన తాను మళ్ళీ అలోచించి వెనకడుగు వేసినట్టు తెలిపారు. తనకి పిల్లలకి మధ్య వేరే వ్యక్తి వస్తే బాగుంటుందా లేదా అనేది బేరీజు వేసుకొని ఆ ఆలోచన ఆపుకున్నట్టుగా ఆమె వెల్లడి చేశారు. దీనితో రేణు దేశాయ్ నుంచి ఈ కామెంట్స్ ఒకింత వైరల్ గా మారాయి.


Click it and Unblock the Notifications











