HCU Controversy: సెంట్రల్ వర్సిటీ అడవుల నరికివేతపై ఘాటుగా రేణుదేశాయ్.. ఎన్టీఆర్ వీడియోతో నిరసన

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఒక సెన్సిటివ్ అంశంపై పెద్ద ఎత్తున రచ్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. కాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సీటీకి సంబంధించి ఉన్న 400 ఎకరాల్లో విస్తరించి ఉన్న అడవిని, అరుదైన మొక్కలని, జంతువుల విచక్షణా రాహిత్యంగా తొలగించడం అనేది సంచలనంగా మారింది. ఐతే దీనిపై ప్రభుత్వం దగ్గర వారి కారణాలు వారికి ఉంటే పచ్చని పర్యావరణాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నామని పలు విమర్శలు ఇపుడు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై రేణు దేశాయ్ తన నిరసనను వ్యక్తం చేశారు. ఈ వివాదంలోకి వెళితే..

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అడవుల నరికివేతపై సోషల్ మీడియాలో సహా అక్కడి యూనివర్సిటీ విద్యార్థులు కూడా పోరాటం చేస్తుండగా ఈ నరికివేత దగ్గర కొన్ని హృదయ విదారక దృశ్యాలు చాలా మందిని కదిలిస్తున్నాయి. ఇక ఈ ఘటనపైనే సెన్సేషనల్ దర్శకుడు నాగ్ అశ్విన్ మొదటిగా తన గళం విప్పగా తన తర్వాత అనేకమంది చిన్న నటీనటులు సైతం సోషల్ మీడియాలో ఈ అడవి నరికివేతకు పర్యావరణ విచ్చిన్నాననికి వ్యతిరేకంగా మద్దతు పలికారు.

Renu Desai shocking post on Telangana CM Revanth Reddy

కాగా వీరితో పాటుగా ప్రముఖ నటుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా చేరారు. అయితే ఈ సెన్సిటివ్ మేటర్ పై రేణు దేశాయ్ సీరియస్ గానే స్పందించడం జరిగింది. కాగా నేరుగా సీఎం రేవంత్ రెడ్డికే పోస్ట్ చేస్తూ తన పలు స్టేట్మెంట్స్ ని ఖండించడం జరిగింది.

అంతే కాకుండా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమా నుంచి ఓ క్లిప్ ని పెట్టి మరీ తన నిరసన చూపించడం గమనార్హం. జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్ కి నటుడు సచిన్ కెడేకర్ తో తన ఫ్యాక్టరీ కోసం ముంబైకి ఎంతో ఆక్సిజన్ ఇచ్చే చెట్లు నరికేయడం సీన్ ఉంటుందిగా దానిని పెట్టి ఇలాంటో హీరోలు సినిమాల్లోనే ఉంటారు బయట కూడా ఉంటే బాగుణ్ణు అనే రీతిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఇలాంటి పరిస్థితులు వచ్చినపుడు ఇలాంటి హీరోలు నిజంగా బయట కూడా ఉంటే బాగుణ్ణు అనిపిస్తుంది అని ఇన్స్టాలో పోస్ట్ చేసిన స్టేటస్ ఇపుడు వైరల్ గా మారింది. కాగా ఇక వీటితో పాటుగా అక్కడ అడవుల్లో జింకలే లేవని రేవంత్ అంటున్నారు ఇపుడు అడవులు కొట్టేస్తుండడంతో అవి దిక్కు తోచక బయటకి వస్తున్నాయి.

ఈ దృశ్యాలు కూడా సీఎం రేవంత్ రెడ్డికి చూపించించండి అంటూ రేణు దేశాయ్ ఒకింత సీరియస్ గానే ఈ మ్యాటర్ పై స్పందిస్తున్నారు. కాగా రేణు దేశాయ్ ప్రకృతి సహా జంతు ప్రేమికురాలు అని కూడా చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు ఒక్క తన ఫాలోవర్స్ కి తప్ప. అందుకే ఈ మేటర్ పై తాను ఈ రేంజ్ లో స్పందిస్తున్నారని చెప్పవచ్చు. మరి ఈ ఘటనపై ఒక ఎండింగ్ ఎలా ఉంటుందో చూడాలి మరి. కాగా ఇపుడు రేణు దేశాయ్ కొడుకు అకిరా నందన్ సినిమా ఎంట్రీ కోసం కసరత్తులు చేస్తున్నాడు. తన ఎంట్రీ కోసం పవన్ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

More from Filmibeat

Read more about: renu desai jr ntr revanth reddy
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X