డబ్బున్నోడికే సహాయం అని షాక్ ఇచ్చిన వ్యక్తి.. రేణుదేశాయ్‌ దిమ్మతిరిగే కౌంటర్!

ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో ఎవరు ఇంటి నుంచి అడుగు బయట పెట్టలేని పరిస్థితి నెలకొంది. సినిమా రంగం కూడా ఇప్పటికే దాదాపు మూతపడి పోయిన పరిస్థితి, ఎక్కడా షూటింగులు జరగడం లేదు. ఈ నేపథ్యంలో దాదాపు సినిమా హీరోలు అలాగే సినిమా నిర్మాణ సంస్థలు మరికొందరు నటీమణులు సైతం కరోనా మందులు అలాగే ఆక్సిజన్ బెడ్స్ కు సంబంధించిన రిక్వెస్ట్స్ ఫార్వర్డ్ చేస్తూ తమ వంతు సాయం చేస్తున్నారు. ఇక అదే క్రమంలో పవన్ మాజీ భార్య, ప్రస్తుతం పలు టెలివిజన్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్న రేణుదేశాయ్ కూడా తన వంతుగా సహాయం అందిస్తున్నారు.

Recommended Video

Netizen కి Renu Desai పవర్ పంచ్, పోయి వాళ్ళని అడుగు అంటూ ఆగ్రహం!! || Filmibeat Telugu

అయితే ఆమెకు నెటిజన్లు కోపం తెప్పించారు..ఈ నేపథ్యంలో ఆమె కొందరి మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కొద్దిరోజులుగా రేణు దేశాయ్ తన ఇన్స్టా ఖాతా ద్వారా అవసరం ఉన్న మేర సాయం చేస్తున్నారు..తాజాగా ఒక వ్యక్తి ''ప్లీజ్ హెల్ప్ మీ మేడం మా అమ్మకి కరోనా పాజిటివ్, బట్ సరిపడా మందులు లేవు మీ హెల్ప్ చేస్తారనే ఉద్దేశ్యంతో మెసేజ్ చేస్తున్నా'' అని మెసేజ్ చేశారు.

Renu Desai slams netizen for accusing her not for helping

దానికి ఆవిడ రిప్లై ఇచ్చే లోపే మళ్లీ మేడం గారు సహాయం చేస్తామన్నారు ఎక్కడ మేడం మీ సహాయం ? ఉన్నవాళ్లనే పట్టించుకుంటారా మేడం మీరు, ,ఆ మిడిల్ క్లాస్ వాళ్ల పరిస్థితులు పట్టించుకోరా ? డబ్బు హోదా ఉన్న వాళ్ళు ప్రాణాలు మిడిల్ క్లాస్ వాళ్లకు కూడా కదా మేడం అని ప్రశ్నించాడు. దీంతో ఆమె తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ''నేను 10-12 రోజుల నుండి సాధ్యమైనంతవరకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాను, నన్ను ప్రశ్నించడానికి నేను రాజకీయ నాయకుడిని లేదా మీ ద్వారా ఎన్నికైన ప్రతినిధిని కాదు అని పేర్కొంది. దయచేసి మీరు ఓటు వేసిన రాజకీయ నాయకులను ప్రశ్నించండన్న ఆమె కొన్నిసార్లు సహాయాన్ని కోరుతూ ఇలా మొరటుగా మరియు బాధ కలిగించే సందేశాలను చూస్తుంటే తనకు చాలా ఇబ్బందికరంగా ఉందని పేర్కొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X